విద్యార్థులను శత్రువుల్లా చూస్తారా? - HC slams CBSE for anti-student attitude treating students as enemies
close
Updated : 14/12/2020 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యార్థులను శత్రువుల్లా చూస్తారా?

సీబీఎస్‌ఈపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం

దిల్లీ: విద్యార్థులను కోర్టులకు లాగుతూ వారిని శత్రువుల్లా చూస్తున్నారంటూ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ)పై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సీబీఎస్‌ఈ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే..

కొవిడ్‌ వల్ల పరీక్షలు రద్దయిన విద్యార్థుల కోసం తీసుకొచ్చిన సీబీఎస్‌ఈ రీఅసెస్‌మెంట్‌ పథకం ఇంప్రూవ్‌మెంట్ విద్యార్థులకు కూడా వర్తించేలా దిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం గతంలో తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సీబీఎస్‌ఈ బోర్డు ద్విసభ్య ధర్మసనానికి పిటిషన్‌ ధాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ జరిపిన హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ ప్రతీక్‌ జలన్‌ నేతృత్వంలోని ధర్మాసనం బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సీబీఎస్‌ఈ విద్యార్థి వ్యతిరేక ధోరణిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. చిన్న చిన్న విషయాలకు మీరు విద్యార్థులను సుప్రీంకోర్టుకు లాగుతున్నారు. వాళ్లు చదువుకోవాలా? లేదా కోర్టుల చుట్టూ తిరగాలా? విద్యార్థులను బోర్డు శత్రువుల్లా చూస్తోంది. దీనికి సీబీఎస్‌ఈ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని న్యాయస్థానం మండిపడింది. ‘రీఅసెస్‌మెంట్‌ పథకాన్ని ఇంప్రూవ్‌మెంట్‌ విద్యార్థులకు కూడా అమలుచేస్తే నష్టమేముంది?’ అని ప్రశ్నించింది. దీనిపై ఇప్పుడు కోర్టుకు రావాల్సినంత అత్యవసరమేముంది అని దుయ్యబట్టింది. విద్యార్థులను ఇలా కోర్టుకు లాగడం ఎంతమాత్రం సమంజసం కాదని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. 

కొవిడ్‌ 19తో ఈ ఏడాది కొన్ని సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దవడంతో విద్యార్థుల కోసం బోర్డు రీఅసెస్‌మెంట్‌ పథకం తీసుకొచ్చింది. దీనికి సుప్రీంకోర్టు కూడా ఆమోదం తెలిపింది. అయితే ఇంప్రూవ్‌మెంట్‌ రాసే విద్యార్థులకు కూడా ఈ స్కీం వర్తిస్తుందని ఈ ఏడాది ఆగస్టు 14న దిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. రెగ్యులర్‌ విద్యార్థుల్లాగే ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కూడా రీఅసెస్‌మెంట్‌ పథకం ప్రకారం స్కోర్‌ ఇవ్వడం లేదా మళ్లీ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఇవ్వాలని సూచించింది. అయితే దీన్ని బోర్డు వ్యతిరేకిస్తోంది. 

ఇవీ చదవండి..

కరోనా కేసులు.. మరోసారి 30వేల దిగువకు

వచ్చే 4-6 నెలలు కరోనా మరింత తీవ్రం: గేట్స్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని