చిరు బర్త్‌డే: మోహన్‌బాబు స్పెషల్‌ విషెస్‌ - Happy birthday Megastar Chiranjeevi
close
Published : 23/08/2020 02:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు బర్త్‌డే: మోహన్‌బాబు స్పెషల్‌ విషెస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరు పుట్టినరోజుకు తోడు వినాయకచవితి పండగ కూడా కలిసి రావడంతో మెగా అభిమానులు డబుల్‌ ధమాకాను ఎంజాయ్‌ చేస్తున్నారు. మరి చిరు పుట్టినరోజుకు ఎవరెవరు ఎలా విష్‌ చేశారంటే..

‘‘చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. నిండు నూరేళ్లు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్  ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్’’ -మోహన్‌బాబు

‘‘ఇండస్ట్రీలో నా ప్రియమైన మిత్రుడు చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ - వెంకటేశ్‌

‘‘చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్ని జనరేషన్స్‌కు మీరొక స్ఫూర్తి. ఇది ఇలాగే కొనసాగాలి. మీరెప్పుడు ఆరోగ్యం, ఆనందంతో ఉండాలి సర్‌’’-మహేశ్‌బాబు

‘‘మెగాస్టార్‌ చిరంజీవిగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా సర్‌’’ -ఎన్టీఆర్‌

‘‘వన్‌ అండ్‌ ఓన్లీ మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా హృదయంలో ఎప్పుడూ ఆయనపై గౌరవం, ప్రేమ నిండి ఉంటాయి. అనేక విషయాల్లో ఆయనే నాకు ‘ఆచార్య’’-అల్లు అర్జున్‌

‘‘ఎన్నో ఏళ్లుగా మీ పుట్టినరోజును ఒక పండగల సెలబ్రేట్‌ చేస్తున్నాం. ఈరోజు మాకు అంతులేని ఆనందాలకు నెలవు. మా వన్‌ అండ్‌ ఓన్లీ మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’’-పూరి జగన్నాథ్‌


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని