సెహ్వాగ్‌లాగే రోహిత్‌ నుంచి ఆశించొచ్చు: భజ్జీ - Harbhajan Singh feels Rishabh Pant is not been able to live upto the expectations
close
Published : 20/11/2020 10:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెహ్వాగ్‌లాగే రోహిత్‌ నుంచి ఆశించొచ్చు: భజ్జీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ ప్రస్తుతం గాయం కారణంగా ఎన్‌సీఏలో శిక్షణ పొందుతున్నాడు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌కు ఎంపికైన అతడు కీలక ఆటగాడని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పేర్కొన్నాడు. తాజాగా స్పోర్ట్స్‌తక్‌ ఛానల్‌తో హిట్‌మ్యాన్‌, రిషభ్‌పంత్ గురించి మాట్లాడాడు. 

‘5 ఓవర్ల పాటు రోహిత్‌ క్రీజులో ఉంటే తర్వాత అతడిని ఆపడం లేదా ఔట్‌ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అతడో ప్రమాదకర బ్యాట్స్‌మన్‌. అతడు అన్ని షాట్లూ ఆడగల సమర్థుడు. హిట్‌మ్యాన్‌ లాంటి ఆటగాడికి ఆస్ట్రేలియాలో పరుగులు చేయడం కష్టం కాకూడదు. అయితే, అతడు కొత్త బంతిని ఎదుర్కోవడమే చాలా ముఖ్యం. దాన్ని ఆడగలిగితే.. సెహ్వాగ్‌ లాగే అతడి బ్యాట్‌ నుంచి పరుగుల ప్రవాహాన్ని ఆశించొచ్చు. అతడో కీలక ఆటగాడు. తొలి టెస్టుకు ముందే పూర్తిగా కోలుకొని జట్టుకు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నా’ అని భజ్జీ పేర్కొన్నాడు. హిట్‌మ్యాన్‌పై భారీ అంచనాలు ఉంటాయని చెప్పాడు. గతేడాది స్వదేశంలో ఎలా చెలరేగాడో ఆస్ట్రేలియా పర్యటనలోనూ అలాగే రెచ్చిపోతాడని అభిమానులు ఆశిస్తున్నట్లు తెలిపాడు.

ఇక రిషభ్ ‌పంత్‌ గురించి భజ్జీ మాట్లాడుతూ.. ఈ యువ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ మళ్లీ మూడు ఫార్మాట్లలో ఆడతాడనే నమ్మకం ఉందని చెప్పాడు. ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా పంత్‌ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకునే విషయంలో అతడు తడబడుతున్నాడు. ఈ క్రమంలోనే ఎన్ని అవకాశాలిచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన నేపథ్యంలో అక్కడ రాణించి మళ్లీ జట్టులో కొనసాగుతాడని భజ్జీ ధీమా వ్యక్తం చేశాడు. ‘పంత్‌ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అయితే, అతడింకా యువ ఆటగాడే. అదీ కాక తనలో ఆడే సత్తా ఉంది. భవిష్యత్‌లో బాగా ఆడతాడు. ఇటీవల ముగిసిన టీ20 లీగ్‌లోనూ సరైన పరుగులు చేయలేకపోయాడు. కానీ, అతడో మంచి క్రికెటర్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. అతడికి మూడు ఫార్మాట్లలో కొనసాగాలనే ఆశ ఉంటే పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. తన శక్తిసామర్థ్యాలు నిరూపించుకోవాలి. సమీప భవిష్యత్‌లో అతడు రాణిస్తాడనే నమ్మకముంది’ అని భజ్జీ వివరించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని