జూనియర్‌ పాండ్య ఎలా ఉన్నాడో చూశారా? - Hardik Pandya shares first full pic of his son
close
Published : 01/08/2020 13:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జూనియర్‌ పాండ్య ఎలా ఉన్నాడో చూశారా?

సామాజిక మాధ్యమాల్లో ఫొటోను పోస్టు చేసిన హార్దిక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య రెండు రోజుల కిత్రం తండ్రి అయిన సంగతి తెలిసిందే. తన సతీమణి నటాషా మగబిడ్డకు జన్మనివ్వగా శనివారం ఆ చిన్నారి ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. అందులో బుజ్జి పాండ్య చాలా అందంగా ముద్దులొలికేలా కనిపిస్తున్నాడు. ఎంతో సంతోషంగా తన కుమారుడిని ఎత్తుకున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. జూనియర్‌ పాండ్య క్యూట్‌గా ఉన్నాడని, కంగ్రాట్స్‌ అని పేర్కొంటూ కామెంట్లు చేస్తున్నారు. 

గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న అతడు కొద్ది నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం ఈ ఏడాది తొలి రోజున సెర్బియన్‌ నటి నటాషా స్టాంకోవిచ్‌కు దుబాయ్‌ సముద్ర జలాల్లో వినూత్నంగా ప్రపోజ్‌ చేశాడు. ఆమె కూడా పాండ్య ప్రేమను అంగీకరించింది. మేలో నటాషా గర్భవతిగా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే జులై 30న ఆమె చిన్నారికి జన్మనిచ్చింది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని