‘ఫిదా’ నటుడికి కరోనా  - Harshvardhan Rane tests positive for COVID
close
Published : 06/10/2020 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఫిదా’ నటుడికి కరోనా 

ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడి

ముంబయి: ‘అవును’ సినిమాతో మెప్పించిన నటుడు హర్షవర్థన్ రాణె(36)కు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం అతడు స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. సోమవారం రాత్రి రాణె ఆ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించాడు.

‘నాకు జ్వరం, కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లాను. కొవిడ్ పరీక్ష కూడా నిర్వహించారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి నుంచి 10 రోజుల పాటు నేను ఒంటరిగా ఉన్నట్లు అనుకోండి. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది!’ అని ట్వీట్ చేశారు. 

హర్షవర్థన్‌ తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అతడు నటించిన హిందీ సినిమా ‘తేయిష్’ అక్టోబర్ 29న జీ5లో విడుదల కానుంది. అవును, అవును 2, మాయ, ఫిదా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయస్థుడే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని