కరోనా నుంచి కోలుకున్న సీఎం: ఏమన్నారంటే! - Haryana CM Manohar Lal Khattar back in Chandigarh
close
Published : 15/09/2020 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా నుంచి కోలుకున్న సీఎం: ఏమన్నారంటే!

చండీగఢ్‌: మాస్కులు ధరించటం, భౌతిక దూరాన్ని పాటించటం వంటి నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ప్రజలకు సూచించారు. కరోనా వైరస్‌ గురించి భయపడనవసరం లేదన్నారు. కానీ, జాగ్రత్తలు పాటించటంలో నిర్లక్ష్యం వహించొద్దని పేర్కొన్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న ఆయన  సోమవారం గురుగ్రామ్‌ నుంచి చండీగఢ్‌కు వచ్చారు. ఆగస్టు 24న ఖట్టర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు. మహమ్మారి నుంచి కోలుకుని సెప్టెంబరు 10న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తరువాత మూడు రోజుల పాటు గురుగ్రామ్‌లోనే ఉన్నారు.  

ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన ఖట్టర్‌

గురుగ్రామ్‌ నుంచి చండీగఢ్‌కు బయలుదేరడానికి ముందు ఖట్టర్‌  మీడియాతో మాట్లాడారు.  కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. తాను త్వరగా కోలుకోవాలని కోరుకున్న వారికీ, తనకు చికిత్స అందించిన డాక్టర్లు ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. ఓ ప్రశ్నకు సమాధానంగా  కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలోనూ అధికారిక కార్యకలాపాలు నిర్వహించినట్లు వివరించారు. తనకు కరోనా ఎలా సోకిందనే విషయంపై స్పష్టత లేదన్నారు. అయితే పాజిటివ్‌ అని తేలడానికి ముందు దిల్లీలో జరిగిన  అధికారిక సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఆ సమయంలోనే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కూ కరోనా సోకింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని