పాత కథలెందుకు నితీశ్‌ జీ..?: తేజస్వి - He is Tired says Tejashwi Yadavs Dig After Nitish Kumars Latest Outburst
close
Published : 26/10/2020 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాత కథలెందుకు నితీశ్‌ జీ..?: తేజస్వి

పట్నా: బిహార్‌లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ప్రచార కార్యక్రమాలు తుది అంకానికి చేరుకోవడంతో అధికార విపక్షాలు తమ విమర్శలకు మరింత పదును పెడుతున్నాయి. శనివారం టెహ్రాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ వ్యాఖ్యలపై తాజాగా ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి దీటుగా సమాధానమిచ్చారు.  గతంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో పరిస్థితులను ఉటంకిస్తూ.. రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు, కళాశాలలు నిర్మించారో తేజస్వి చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనిపై తేజస్వి యాదవ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘ గౌరవనీయులైన ముఖ్యమంత్రి నితీశ్‌ బాగా అలసిపోయారు. ఆయన  సత్యదూర, పాత ప్రసంగాలతో ప్రజలు కూడా విసిగిపోయారు. రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది, అభివృద్ధి కుంటుపడింది. ఈ సమస్యలన్నిటికీ ఓ పరిష్కారం చూపించడం ఆయనకు చేతకావడం లేదు. అందుకే ఆయన ప్రస్తుతాన్ని వదిలి గతాన్ని తవ్వుకుంటున్నారు.’’ అని వ్యాఖ్యానించారు.

నితీశ్‌కుమార్‌ శనివారం టెహ్రాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. పాఠశాలలు, కళాశాలలేమైనా కట్టారా? ఇవాళ నువ్వు చదువుకోవాలనుకుంటే మీ ఆమ్మానాన్నల్నే అడుగు వాళ్లెక్కడెక్కడ కట్టారో చెబుతారు’’ అంటూ విమర్శించారు. 

మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార, విపక్షాలు సాయశక్తులు ఒడ్డుతున్నాయి. 10 లక్షల ఉద్యోగాలిస్తామని ఆర్జేడీ ప్రకటించగా, 19 లక్షల ఉద్యోగాలతోపాటు కరోనా  టీకాను ఉచితంగా అందిస్తామని భాజపా ప్రకటించింది. ఎన్డీయే కూటమిలో భాగంగా భాజపా, జేడీయూ కలిసి బరిలోకి దిగుతుండగా.. ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌పార్టీలు కలిసి మహాగట్‌బంధన్‌ ఏర్పాటు చేశాయి. మరోవైపు దివంగత కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాసవాన్‌ తనయుడు చిరాగ్‌ పాసవాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగుతోంది. బిహార్‌లోని 243 శాసనసభ స్థానాలకుగానూ ఈ నెల 28 నుంచి 3 విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని