కొవిడ్ సోకిన వృద్ధులకు గుండెపోటు?  - Heart Attacks Common In Covid Elders
close
Published : 31/12/2020 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్ సోకిన వృద్ధులకు గుండెపోటు? 

ఇంటర్నెట్‌ డెస్క్‌ : కొవిడ్‌ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధుల్లో గుండెపోటు రావటం సాధారణమే అని తాజా పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా 80 ఏళ్లు పైబడిన వారిలో ఇలాంటి ముప్పు సహజమేనని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కరోనా సోకిన వృద్ధుల్లో  ప్రమాదాలకు గల కారణాలు, వారి ఆరోగ్య పరిస్థితులపై అమెరికా యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధన జరిపారు. వైరస్‌ బారినపడి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వయోవృద్ధుల్లో గుండెపోటు రావటాన్ని గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. వీటికి సంబంధించిన తాజా నివేదిక బీఎంజే జర్నల్‌లో ఇటీవలే ప్రచురితం అయింది. 
పరిశోధనలో భాగంగా అమెరికా వ్యాప్తంగా 68 ఆసుపత్రుల్లో తీవ్ర అస్వస్థతకు గురైన 5,019 మందిని పరిగణనలోకి తీసుకున్నారు. వీరంతా 80 ఏళ్లు పైబడి ఐసీయులో చికిత్స పొందుతున్న వారే. వీరిలో 701 మంది అంటే 14 శాతం ఆసుపత్రిలో చేరిన 14 రోజుల్లోనే గుండెపోటుకు గురైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరిలో 400 మందికి మాత్రమే సీపీఆర్ అందించటం ద్వారా ప్రాణాలను కాపాడినట్లుగా నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇలా గుండె సంబంధ సమస్యలు ఎదుర్కొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతున్న వారు కేవలం చిన్నపాటి సీపీఆర్‌ చేయటం ద్వారా ప్రాణాలతో బయటపడుతున్నారని నిపుణులు గుర్తించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వృద్ధుల్లో 80 ఏళ్లు పైబడిన వారిలోనే ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతున్నట్లు నిపుణులు స్పష్టం చేశారు. సీపీఆర్‌ చేసినప్పటికీ గుండె ఆగిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నట్లు తేల్చారు.
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని