అమ్మ మృతితో నాన్న‌లో పుట్టిన‌ ఆలోచ‌న‌
close
Published : 23/06/2020 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మ మృతితో నాన్న‌లో పుట్టిన‌ ఆలోచ‌న‌

హైద‌రాబాద్‌: విశ్వ విఖ్యాత న‌ట‌సార్వభౌమ నంద‌మూరి తార‌క రామారావు బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్‌ ఆసుప‌త్రి సేవలు ప్రారంభించి 20 ఏళ్లు పూర్త‌యింది. ఈ ఆసుప‌త్రి ద్వారా ల‌క్ష‌లాది క్యాన్స‌ర్ రోగుల‌కు ఉచితంగా చికిత్స అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. పేద‌ల కోసం ఎన్టీఆర్ స్థాపించిన ఈ ఆసుపత్రి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క‌థానాయ‌కుడు బాల‌కృష్ణ సోష‌ల్‌మీడియాలో మాట్లాడారు. వైద్య‌ సిబ్బందికి, దాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

‘‘ఆ రోజు మా అమ్మ క్యాన్సర్ మ‌హ‌మ్మారితో‌ మరణించడం వ‌ల్ల మా నాన్న‌‌ కలత చెందారు. అప్పుడు ఆయ‌న మదిలో జ‌న్మించిన ఆలోచ‌నే.. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిట‌ల్‌ అండ్ రీసెర్చ్ సెంటర్. నేటికి 20 వసంతాలు పూర్తి చేసుకుంది. 500 పడకలతో, 1500 మందికి పైగా సిబ్బందితో.. ఇప్పటివరకూ సుమారు 2.5 లక్షలకు పైగా క్యాన్సర్ బాధితులకు ఉత్తమ ప్రమాణాలతో చికిత్స అందించాం. క్యాన్సర్‌పై ఈ పోరాటంలో మాకు వెన్నుదన్నుగా నిలిచిన దాతలకు,  వైద్య సిబ్బందికి, సహకరిస్తున్న ప్రభుత్వాలకు, అధికారులకు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని బాల‌య్య‌ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని