అక్టోబరు వరకూ విస్తారంగా వర్షాలు..! - Heavy rain to persist in south northeast India till October
close
Published : 20/09/2020 00:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్టోబరు వరకూ విస్తారంగా వర్షాలు..!

వెల్లడించిన భారత వాతావరణ శాఖ..

న్యూదిల్లీ: దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ఏడాది అక్టోబరు వరకూ విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా జులై 1 నుంచి ఇప్పటి వరకూ సాధారణం కంటే 6.1 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవటంతో వారం కిందట వరకూ దక్షిణ భారతం, ఈశాన్య రాష్ట్రాల్లో 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణంలో ఈ మార్పులు చోటు చేసుకున్నట్లు వాతావరణ శాఖ నివేదికలో తెలిపింది.

రెండు మూడు రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ద్రోణి వల్ల సెప్టెంబరు మాసం చివరి వరకూ దక్షిణ, ఈశాన్య, తూర్పు భారతంలో అధిక వర్షాలు పడనున్నాయట. ఇదే సమయంలో వాయవ్య భారత రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా సెప్టెంబరు మాసంలో సాధారణం కంటే 12.6 లోటు వర్షపాతం నమోదైంది. ఇది వాయవ్య ప్రాంతంలో 52.8 ఉండగా, మధ్య భారతావనిలో 33.2 లోటు వర్షపాతంగా రికార్డైంది. అల్పపీడనం పెరుగుదల వల్ల పశ్చిమదిశగా వీచే పవనాలు వచ్చే వారానికి మరింత బలపడతాయని జాతీయ వాతావరణ సూచన ఉన్నతాధికారి సతీదేవి తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని