ఏడు పాత్రల అంతర్మథనం - Here is the exciting and enthralling teaser of Ksheera Saagara Madhanam
close
Published : 23/08/2020 02:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏడు పాత్రల అంతర్మథనం

హైదరాబాద్‌: సంజయ్‌ కుమార్‌, మానస్‌ నాగులపల్లి, అక్షత సోనావని ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘క్షీర సాగర మథనం’. అనిల్‌ పంగులూరి దర్శకుడు. శ్రీ వేంకటేశ్వర పిక్చర్స్‌, ఆర్ట్స్‌ అండ్‌ హార్ట్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు క్రిష్‌ విడుదల చేశారు.

‘‘ఎగసే అలలు.. ఎదలోని భావాలు అదుపులో ఉన్నంత వరకు అందంగానే ఉంటాయి. ఒక్కసారి అదుపుతప్పి తప్పు దారి పడితే. చేసిన తప్పు తెలిసిన క్షణం.. మరణం ముంగిట ఉంటే. మనలోని మనకే తెలియక జరిగే అంతర్మథనమే.. ‘క్షీరసాగర మథనం’’ అన్న సంభాషణలతో టీజర్‌ ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలతో రూపొందిస్తున్న చిత్రమిది. చిత్రీకరణతో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. కొత్త తరహా చిత్రాల్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉంద’’న్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని