RRR: భీమ్‌ ఉగ్రావతారం - Here tarak as the INTENSE Komaram Bheem from RRR Movie
close
Updated : 21/05/2021 08:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: భీమ్‌ ఉగ్రావతారం

‘‘నా భీమ్‌ది బంగారం లాంటి మనసు. ఆయనే కనుక తిరుగుబాటు చేస్తే బలంతో ధైర్యంగా ఎదురు నిలుస్తాడు’’ అంటున్నారు దర్శకుడు రాజమౌళి. ఇప్పుడాయన దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ కథా నాయికలు. విప్లవ వీరులు కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజుల  జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న ఫిక్షనల్‌ కథాంశంతో రూపొందుతోంది. ఇందులో భీమ్‌గా   ఎన్టీఆర్‌ నటిస్తుండగా.. అల్లూరి పాత్రను చరణ్‌ పోషిస్తున్నారు. గురువారం ఎన్టీఆర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన కొత్త లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో తారక్‌.. కొమురం భీమ్‌గా ఉగ్రరూపంలో దర్శనమిచ్చారు. శత్రువులపైకి ఈటె ఎక్కుపెట్టి పోరుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపించారు. ఈ చిత్రం ఇప్పటికే తుది దశ చిత్రీకరణకు చేరుకుంది. దాదాపు రూ.450కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా చిత్రం.. ఈ ఏడాది అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు
ఇప్పటికే ప్రకటించారు.

కొత్త కబుర్లు అందాయి..
ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా దర్శకులు కొరటాల శివ, ప్రశాంత్‌ నీల్‌ సినిమాలకు సంబంధించి కొత్త కబుర్లు అందాయి. ఎన్టీఆర్‌ తన 30వ చిత్రాన్ని కొరటాల దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ఈ చిత్రం నుంచి ఓ కొత్త పోస్టర్‌ను పంచుకొని తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దీంట్లో తారక్‌ స్మార్ట్‌ లుక్‌లో ఎంతో క్లాస్‌గా కనిపించారు. ఇక ఎన్టీఆర్‌ 31వ చిత్రం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఉండనున్నట్లు మైత్రీ మూవీస్‌ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రశాంత్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ ‘‘రక్తంతో తడిసిన నేల ఒక్కటి మాత్రమే గుర్తుంచుకుంటుంది’’ అని ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. తమ కలయికలో రానున్న కొత్త చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలియజేశారు. ఇక దర్శకుడు బుచ్చిబాబు సాన కూడా ట్విటర్‌ వేదికగా తారక్‌కి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో సినిమా కోసం తానూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలియజేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని