PAAGAL:  సింగిల్‌ చిన్నోడే.. ప్రేమలో ఉంటాడే - Here the Crazy Ee Single Chinnode Lyrical Song from PAAGAL
close
Updated : 03/06/2021 10:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PAAGAL:  సింగిల్‌ చిన్నోడే.. ప్రేమలో ఉంటాడే

మ్మాయి కనిపిస్తే చాలు... ప్రేమలో పడిపోయానంటూ ఓ పువ్వు చేతికందిస్తాడు. ఇలాంటి వాళ్లని ఎవరైనా పాగల్‌ అనే అంటారు కదా. మరి ఈ ప్రేమ ‘పాగల్‌’ ప్రణయగాథ ఏ అమ్మాయి దగ్గర ఆగిందో తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. విశ్వక్‌సేన్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. నివేదా పేతురాజ్‌ నాయిక. నరేష్‌ కుప్పిలి దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్‌ నిర్మాత. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. సిమ్రాన్‌ చౌదరి, మేఘా లేఖ కీలక పాత్రధారులు. ఈ చిత్రంలోని ‘ఈ సింగిల్‌ చిన్నోడే...’ అంటూ సాగే పాటని విడుదల చేసింది చిత్రబృందం. కృష్ణకాంత్‌ రచించిన ఈ గీతాన్ని, బెన్నీ దయాల్‌ ఆలపించారు. రధన్‌ స్వరాలు సమకూర్చారు. ‘‘ప్రతిసారీ వేర్వేరు అమ్మాయిలతో ప్రేమలో పడుతుంటాడు. అలా ప్రేమలో ఉన్న తాజాదనాన్ని అనుభవించే సందర్భంలో వచ్చే పాటే ఇది’’అని సినీ వర్గాలు తెలిపాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని