దుబాయ్‌ వచ్చింది జల్సా కోసమా: కోహ్లీ - Here to play cricket not have fun hope everyone understands that Kohli on IPL bio-bubble
close
Published : 02/09/2020 02:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దుబాయ్‌ వచ్చింది జల్సా కోసమా: కోహ్లీ

పరిస్థితులను అర్థం చేసుకొని ప్రవర్తించాలని హితవు

దుబాయ్‌: సరదాగా గడిపేందుకు దుబాయ్‌కి రాలేదని ఆటగాళ్లు గుర్తించాలని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఐపీఎల్‌-2020 సవ్యంగా జరిగేందుకు బయోబడుగను అందరూ గౌరవించి తీరాల్సిందేనని స్పష్టం చేశాడు. సాధ్యమైనంత త్వరగా పరిస్థితులకు అలవాటు పడాలని సూచించాడు. ఆర్‌సీబీ యూట్యూబ్‌ షో ‘బోల్డ్‌ డైరీస్‌’లో తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌లో క్రికెట్‌ తనకు పూర్తిగా దూరమవ్వలేదని కోహ్లీ అన్నాడు. బీసీసీఐ ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ, బయో బుడగ నిబంధనలను అందరూ కచ్చితంగా పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేశాడు. ‘మనమందరం క్రికెట్‌ ఆడేందుకు ఇక్కడికి వచ్చాం. అవాంతరాలు లేకుండా టోర్నీ జరగాలంటే బయోబుడగను గౌరవించాలి. నగర వీధుల్లో తిరిగేందుకు, జల్సా చేసేందుకు దుబాయ్‌ రాలేదు. మనం సాధారణ పరిస్థితుల్లో లేము’ అని అతడు తెలిపాడు.

‘ఇప్పుడున్న దశను అంగీకరించి, మనకు దొరికిన అవకాశాన్ని అర్థం చేసుకోవాలి. ఐపీఎల్‌లో భాగస్వాములు అయితే చాలు. పరిస్థితులకు అనుగుణంగా లేనట్టు ఎవ్వరూ ప్రవర్తించొద్దు’ అని విరాట్‌ అన్నాడు. ఐదు నెలల తర్వాత క్రికెట్‌ ఆడటంపై  స్పందించాడు. కొన్ని నెలల క్రితం అసలు ఐపీఎల్‌ జరుగుతుందని ఎవరూ ఊహించలేదని పేర్కొన్నాడు. ‘నిన్న మేం సాధన చేసినప్పుడు క్రికెట్‌కు‌ దూరమై ఎంత కాలమైందో అర్థమైంది. సాధన చేసేటప్పుడు మొదట కాస్త ఆందోళనగా అనిపించింది. ఎక్కువ ఎడబాటే వచ్చినా అలా అనిపించలేదు’ అని అన్నాడు.

‘మాపై ఒత్తిడి లేకుండా, పరిస్థితులను అర్థం చేసుకొనేలా మా సహాయక బృందం కష్టపడింది. ఒక్కరి ప్రాధామ్యాల కోసం జట్టు సంప్రదాయాన్ని మార్చకూడదు. ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఆడటం వింతగానే అనిపిస్తుంది. పదేళ్ల క్రితం రంజీల్లో అలా ఆడాను. అయితే ఏదో ఒక దశలో అందరం అలా ఆడినవాళ్లమే కదా. అభిమానుల లోటు కనిపిస్తుంది కానీ త్వరగానే మాయమవుతుంది. దూకుడుగా సంబరాలు చేసుకొనే అవకాశం లేదు. ఏదేమైనప్పటికీ అన్నింటి మధ్య సమతూకం అవసరం. అనుష్క గర్భవతి అన్న విషయం తెలియగానే సంతోషం పట్టలేకపోయాను’ అని విరాట్‌ తెలిపాడు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని