అక్షయ్‌ మార్చుకోలేని చెడ్డ అలవాటు ఇదే - Hero Akshay Kumar bad habit is this one
close
Published : 15/10/2020 22:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్షయ్‌ మార్చుకోలేని చెడ్డ అలవాటు ఇదే

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌లో ఆదర్శ జంటల్లో అక్షయ్‌-ట్వింకిల్‌ ఖన్నా జోడీ ఒకటి. వీరిద్దరూ సామాజిక మాధ్యమాల వేదికగా ఒకరిపై ఒకరు సరదాగా కామెంట్లు చేసుకుంటూ ఉంటారు. అటు వృత్తిగతపరంగా, ఇటు వ్యక్తిగతంగా సమప్రాధాన్యం ఇస్తారు అక్షయ్‌. షూటింగ్‌లకు సరైన సమయానికి వెళ్లే ఆయన, సాయంత్రం 6గంటలైతే పేకప్‌ చెప్పి ఇంటికి వచ్చేయాల్సిందే. అయితే, ఇంటికి వచ్చాక అక్షయ్‌కు ఓ చెడ్డ అలవాటు ఉందట.

తాజాగా అక్షయ్‌ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను షేర్‌ చేశారు. ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. క్రీడల పట్ల తనకున్న అమిత ప్రేమే ఆ చెడ్డ అలవాటని ఈ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌  తెలిపారు. షూటింగ్‌ నుంచి వచ్చి బట్టలు మార్చుకోవటమే ఆలస్యం.. ఏదో ఒక స్పోర్ట్స్‌ కార్యక్రమం చూడటంలో నిమగ్నమైపోతాడట.

ఓసారి ఇలాగే తన భార్య ట్వింకిల్‌ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని కూడా మిస్సయ్యాడట ఈ హీరో. ఇంట్లో ట్వింకిల్‌తో మాట్లాడుతూ ఉన్నా చేతిలో ఉన్న మొబైల్‌లో స్కోరు చూసుకుంటూ ఉండటాన్ని ఆమె ఓ కంట గమనిస్తూనే ఉంటుందట. అయితే ఓ భర్తగా తాను మార్చుకోలేని చెడ్డ అలవాటు ఇదేనన్నాడు అక్షయ్. ఆయన కీలక పాత్రలో నటించిన ‘లక్ష్మీబాంబ్‌’ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో చిత్రం బెల్‌బాటమ్‌ కూడా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని