close

తాజా వార్తలు

నటుడు సునీల్‌కు స్వల్ప అస్వస్థత

హైదరాబాద్‌: ప్రముఖ టాలీవుడ్‌ హాస్యనటుడు, కథానాయకుడు సునీల్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురువారం ఉదయం చికిత్స నిమిత్తం ఆయన గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. గొంతు ఇన్‌ఫెక్షన్‌, వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉండడం వల్ల సునీల్‌ కొంచెం నీరసించారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో విడుదలైన ‘అల..వైకుంఠపురములో..’ చిత్రంలో సునీల్ కీలకపాత్రను పోషించారు. నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఆయన ‘కలర్‌ఫొటో’ అనే సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.