ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వానికి నోటీసులు - High Court Gave Notices to Govt On MLC Appointed Issues
close
Published : 23/12/2020 19:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వానికి నోటీసులు

హైదరాబాద్‌: ఎమ్మెల్సీలుగా గోరటి వెంకన్న, బసవరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ నియామకంపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముగ్గురు ఎమ్మెల్సీల నియామకాన్ని సవాలుచేస్తూ సామాజిక కార్యకర్త ధనగోపాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. గవర్నర్‌ కోటాలో గోరటి వెంకన్న, సారయ్య, దయానంద్‌ ఎమ్మెల్సీ పదవులు పొందగా.. వివిధ రంగాల్లో నిష్ణాతులను గవర్నర్‌ కోటాలో నియమించాలన్న నిబంధన పాటించలేదని పిటిషనర్‌ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వంలోపాటు ముగ్గురు ఎమ్మెల్సీలను హైకోర్టు ఆదేశించింది.

ఇవీ చదవండి...

బిక్కవోలులో సత్యప్రమాణం చేసిన నేతలు

బెంగాల్‌లో ఫిరాయింపుల జోరు!
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని