హిమాచల్‌ మంత్రికి కరోనా - Himachal minister Ram Lal Markanda tests positive for Covid-19
close
Published : 15/10/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హిమాచల్‌ మంత్రికి కరోనా


ఇంటర్నెట్‌ డెస్క్ ‌: హిమాచల్ప్రదేశ్‌ ప్రజాప్రతినిధులు ఒకరి తరువాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రి రామ్‌లాల్‌ మార్కండకు కరోనా సోకింది. ఈ విషయం గురించి ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. తనకు కరోనా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు.

మార్కండ ఇటీవలే అటల్‌ టన్నెల్‌ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి హాజరైన తరువాత కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన రెండో మంత్రి రామ్‌లాలే. ఈ టన్నెల్‌ ప్రారంభోత్సవం తరువాత ఆయన తన నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ప్రస్తుతం తన అధికారిక నివాసంలోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఇది వరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని