close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120027883 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => y8GYsF1k0Nk [video_short_link] => y8GYsF1k0Nk [created_by] => 8923881 [created_date] => 2020-02-27 16:22:06.549505 [modified_by] => [modified_date] => [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

వెంటాడే గాయం..చేశానో ఏ నేరం

రేపు విడుదల కానున్న ‘హిట్‌’

హైదరాబాద్‌: ‘వెంటాడే గాయం.. చేశానో ఏ నేరం’ అని అంటున్నారు విశ్వక్‌సేన్‌. గతేడాది విడుదలైన ‘ఫలక్‌నుమాదాస్‌’ సినిమాతో మాస్‌ ప్రేక్షకులకు చేరువయ్యారు నటుడు విశ్వక్‌సేన్‌. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హిట్‌’. నేచురల్‌ స్టార్‌ నాని నిర్మాణ సంస్థ ‘వాల్‌ పోస్టర్‌ సినిమా’ పతాకంపై నాని సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్‌సేన్‌ పోలీస్‌ అధికారికగా కనిపించనున్నారు. 

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ‘హిట్‌’ సినిమా నుంచి ‘వెంటాడే గాయం’ అనే పాటను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. మోహన భోగరాజు అలపించిన ఈ పాటకు సంబంధించిన లిరికల్‌ వీడియోను సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో ప్రీతి అనే కళాశాల విద్యార్థి మిస్సింగ్‌ కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా విశ్వక్‌ సేన్‌ కనిపించనున్నారు. రుహానీ శర్మ కథానాయిక. 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.