యువీ ఆరు సిక్స్‌లకు 13 ఏళ్లు - How Time Flies Yuvraj Singh Recalls Six Sixes
close
Published : 19/09/2020 15:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యువీ ఆరు సిక్స్‌లకు 13 ఏళ్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువరాజ్‌సింగ్‌ ఆరు సిక్సర్లు క్రికెట్‌ అభిమానులకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆ వీర బాదుడికి నేటితో 13 ఏళ్లు. మొట్టమొదటి టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా 2007 సెప్టెంబర్‌ 19న ఇంగ్లాండ్‌తో జరిగిన  లీగ్‌ మ్యాచ్‌లో యువీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. స్టువర్ట్ బ్రాడ్‌ వేసిన 19వ ఓవర్‌లో 6 సిక్సర్లు దంచేసి చరిత్ర సృష్టించాడు. ఆ సందర్భాన్ని భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నేడు గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లోని ఓ స్టిల్‌ను పంచుకుంటూ ‘సమయం ఎంత వేగంగా పరుగెడుతోందో’ అంటూ క్యాప్షన్‌ పెట్టాడు. కాగా యువీ పోస్టుపై బ్రాడ్‌ ఫన్నీగా స్పందించాడు. ‘ఈ సమయం కంటే ఆరోజు బంతే వేగంగా పరుగెట్టింది’ అంటూ రిప్లే ఇచ్చాడు. యువీ పోస్టుపై గౌతమ్‌ గంభీర్‌ సైతం సరదా వ్యాఖ్యానించారు. ఓ హిందీ సినిమాలోని డైలాగ్‌ను గుర్తుచేస్తూ ‘ఈ రికార్డు నాకు ఇచ్చెయ్‌’ అని అన్నాడు. వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌గేల్‌ లెజండరీ అంటూ కొనియాడాడు.

డర్బన్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్‌-గౌతమ్‌ గంభీర్‌ అర్ధ శతకాలు సాధించి శుభారంభం అందించారు. అనంతరం క్రీజులోకి వెళ్లిన యువరాజ్‌సింగ్‌ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లతో చెలరేగాడు. కేవలం 16 బంతుల్లో 58 పరుగులు సాధించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని