కరోనా: బాలీవుడ్‌ డాన్సర్లకు హృతిక్‌ సాయం - Hrithik Roshan deposits money in bank accounts of 100 Bollywood dancers amid corona crisis
close
Published : 26/07/2020 11:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా: బాలీవుడ్‌ డాన్సర్లకు హృతిక్‌ సాయం

ముంబయి: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో సినీ పరిశ్రమ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. నాలుగు నెలలు గడిచినా ఇంకా షూటింగ్స్‌ ప్రారంభం కాకపోవడంతో నటీనటుల నుంచి సినీ కార్మికుల వరకు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో బ్యాక్‌గ్రౌండ్‌ డాన్సర్లూ ఉన్నారు. షూటింగ్స్‌ లేకపోవడంతో సినిమా పాటల్లో చేసే డాన్స్‌పైనే ఆధాపడిన వారంతా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వంద మంది బ్యాక్‌గ్రౌండ్‌ డాన్సర్లకు బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ ఆర్థిక సాయం అందజేశాడు. వారి బ్యాంక్‌ అకౌంట్లలో డబ్బులు జమ చేశాడు. ఎంత మొత్తం సాయం చేశాడన్న దానిపై సమాచారం లేదు. కానీ ఆర్థిక సాయం అందుకున్న డాన్సర్లు హృతిక్‌ రోషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

హృతిక్‌ రోషన్‌ ఆర్థిక సాయంపై డాన్సర్స్‌ కో-ఆర్డినేటర్‌ రాజ్‌ సురాణి మాట్లాడుతూ ‘‘ఈ కరోనా కష్ట సమయంలో హృతిక్‌ రోషన్‌ వంద మంది డాన్సర్లకు సాయం చేశారు. డాన్సర్లలో కొంతమంది స్వగ్రామాలకు వెళ్లారు. మరికొందరు ఇంటి అద్దె  కూడా కట్టలేని దీనస్థితిలో ఉన్నారు. ఒక డాన్సర్‌ కుటుంబం కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటోంది. ఇలాంటి వారిని అవసరమైన సమయంలో హృతిక్‌ ఆదుకున్నారు. దీంతో వారంతా సంతోషపడుతున్నారు. హృతిక్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు’’అని తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని