డ్రై స్వాబ్‌ టెస్ట్‌ కోసం అపోలో, సీసీఎంబీ జట్టు - Hyderabad CCMB ties with Apollo to develop dry swab test for Covid-19
close
Published : 10/12/2020 23:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రై స్వాబ్‌ టెస్ట్‌ కోసం అపోలో, సీసీఎంబీ జట్టు

హైదరాబాద్‌: కొవిడ్‌-19 నిర్ధారణ కోసం అపోలో హాస్పిటల్స్‌ భాగస్వామ్యంతో సీఎస్‌ఐఆర్‌, సీసీఎంబీ డ్రై స్వాబ్‌ టెస్ట్‌- డైరెక్ట్ ఆంప్లిఫికేషన్ ర్యాపిడ్ ఆర్టీ-పీసీఆర్ (డీఏఆర్‌ఆర్టీ-పీసీఆర్‌) టెస్టు కిట్‌ను అభివృద్ధి చేశాయి. దీన్ని వాణిజ్యపరంగా ఉపయోగించేందుకు వీలుగా తయారీ చేసేందుకు సీసీఎంబీ, సీఎస్ఐఆర్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్లు అపోలో ఆస్పత్రి ప్రకటించింది. సురక్షితమైన, తక్కువ ధరలో లభించే ఈ టెస్టు దేశ వ్యాప్తంగా అపోలో ఆసుపత్రుల నెట్‌వర్క్‌ ద్వారా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం అనుసరిస్తున్న టెస్టులతో పోల్చితే మానవ ఉపయోగం, సమయం 40 నుంచి 50 శాతం ఆదా అవుతుందని వెల్లడించింది.

డీఏఆర్‌ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష సురక్షితమైనదే కాకుండా ఫలితం వేగంగా వస్తుందని సీసీఎంబీ డైరక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా అన్నారు. ప్రస్తుతమున్న ఆర్టీ-పీసీఆర్‌ కన్నా తక్కువ ధరకే లభ్యమవుతుందని తెలిపారు. ‘‘ప్రస్తుతం కరోనా ప్రభావం నుంచి ప్రపంచం బయటపడుతున్న సమయంలో ప్రజలు వేగంగా, కచ్చితంగా ఉండే నిర్ధరణ పరీక్షల కోసం చూస్తున్నారు. ఈ సమయంలో ఎన్ని ఎక్కువ పరీక్షలు జరిగితే అంత మంచిది’’ అని రాకేశ్‌ మిశ్రా అన్నారు. ‘‘కొవిడ్‌ -19 నుంచి ప్రపంచం అన్‌లాక్‌ అవుతున్న సమయంలో వైరస్‌ నిర్ధరణ ఎంత వేగంగా ఉంటే అంత వేగంగా వైరస్‌ను అదుపుచేయగలం. దీని ద్వారా సగానికిపైగా వైరస్‌ సంక్రమణను అధిగమించగలం’’ అని అపోలో గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ సంగీతారెడ్డి అన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని