మెట్రో రైల్‌ ప్రయాణ సమయాల్లో మార్పులు - Hyderabad Metro Rail timings extended in the morning
close
Updated : 03/12/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెట్రో రైల్‌ ప్రయాణ సమయాల్లో మార్పులు

వెల్లడించిన మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

హైదరాబాద్‌: నగర ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రయాణ సమయాన్ని పొడిగించారు. రేపటి నుంచి ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు సర్వీసులు నడపనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఉదయం 7 గంటలకు మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యేవని.. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు 30 నిమిషాలు ముందుగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇక రాత్రి సమయంలో ఎలాంటి మార్పుల్లేవని.. గతంలోలాగే చివరి ట్రైన్ రాత్రి 9.30 గంటలకు ఉంటుందని స్పష్టం చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో లాక్‌డౌక్‌ కారణంగా ప్రయాణికులకు అందుబాటులో లేకుండా పోయిన భరత్‌నగర్‌, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్‌ మెట్రో స్టేషన్లు రేపటి నుంచి తెరుచుకోనున్నట్లు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని