టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వార్నర్‌ - Hyderabad won the toss and elected to
close
Updated : 11/10/2020 15:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వార్నర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: యూఏఈలో జరుగుతున్న టీ20 మెగా క్రికెట్‌ లీగ్‌ ఇప్పటికే సగం సీజన్‌ పూర్తి అవడానికి వచ్చింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే దుబాయ్‌ వేదికగా మరికాసేపట్లో హైదరాబాద్‌, రాజస్థాన్‌ జట్లు పోటీ పడనున్నాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కాగా, హైదరాబాద్‌ ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడగా 3 విజయాలు, 3 ఓటములతో 6 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్‌ 6 మ్యాచ్‌ల్లోనే 2 విజయాలు, 4 ఓటములతో 4 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో డేవిడ్‌ వార్నర్‌ టీమ్‌ మరో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు సాగాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

హైదరాబాద్‌ జట్టు: బెయిర్‌స్టో, డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), మనీష్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, విజయ్‌ శంకర్‌, ప్రియమ్‌ గార్గ్‌, అభిషేక్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌, ఖలీల్‌ అహ్మద్‌

రాజస్థాన్‌ జట్టు: జోస్‌ బట్లర్‌, రాబిన్‌ ఉతప్ప, స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌), సంజూ శాంసన్‌, బెన్‌స్టో్క్స్‌, రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాతియా, జోఫ్రా ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌, కార్తీక్‌ త్యాగి, వరుణ్‌ ఆరోన్‌



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని