close

తాజా వార్తలు

విమర్శలను అసలే పట్టించుకోను: అమీర్‌ఖాన్‌

ముంబయి: బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ఖాన్‌.. సినిమాల్లో తప్పితే వార్తల్లో పెద్దగా కనిపించరు. సామాజిక మాధ్యమాల్లో అయితే ఆయన కోసం వెతికినా దొరకరు. అయితే, తనపై వచ్చే విమర్శలు, ట్రోల్స్‌ను అసలే పట్టించుకోనని అంటున్నాడీ పీకే. ఆమీర్‌ఖాన్‌ నటించిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి ఆయనపై విమర్శలు పెరిగిపోయాయి. ఆయనపై విమర్శలు, సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోలింగ్‌ పెరిగిపోయింది. నిజానికి ఆమీర్‌ఖాన్‌ బయట ఎక్కువగా కనిపించరన్నది వాస్తవం. పురస్కార ప్రధానోత్సవాలకు హాజరుకారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఆయన చాలా తక్కువగా కనిపిస్తుంటారు. 2018లో ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎందుకిలా అని ఆయనను ప్రశ్నిస్తే ఇలా స్పందించారు..
‘నేను సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఉండనని మీరు అనవచ్చు. నిజం చెప్పాలంటే నేను నా ప్రపంచంలో సగం సమయం మాత్రమే ఉంటాను. అందుకే ఆ కాస్త సమయాన్ని కూడా సోషల్‌ మీడియాకు కేటాయించాలని అనుకోను, పక్షపాతంగా వ్యవహరించేవారు చేసే విమర్శలపై స్పందించాల్సిన అవసరం నాకు లేదు’ అని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఏది చెప్పాలనుకున్నా.. సినిమాల ద్వారానే చెప్తానని అన్నారు. అంతే కాకుండా ప్రజలకు సేవలు చేసేందుకు సత్యమేవ జయతే, పాని ఫౌండేషన్‌లున్నాయి. తాను ఏదీ చెప్పనని, చేసి చూపిస్తానని వివరించారు. ‘నా సినిమాలు విడుదలైనప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులకు అభిమానులు పెట్టే ప్రతి కామెంట్‌ను చదువుతాను. ఎందుకంటే నా సినిమాల గురించి అభిమానులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత నాపైన ఉంది’ అని ఆయన అన్నారు. కారణం లేకుండా తనపై ఎవరైనా కక్షపూరితంగా విమర్శలు చేస్తే వాటికి బాధపడాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఒకవేళ ఎవరైనా నిస్పక్షపాతంగా విమర్శిస్తే మాత్రం ఆ విమర్శలను స్వాగతిస్తానన్నారు. విమర్శల నుంచి ఒక నటుడిగా ఎంతో నేర్చుకోవడానికి వీలుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలాగే ఎవరైనా తనను అభినందిస్తే సంతోషంగా భావిస్తానన్నారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.