అతడి బౌలింగ్‌లో అంత ఈజీ కాదు: పడిక్కల్‌ - I felt was challenging was Rashid Khan Devdutt Padikkal
close
Published : 16/11/2020 13:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అతడి బౌలింగ్‌లో అంత ఈజీ కాదు: పడిక్కల్‌

ఇంటర్నెట్‌డెస్క్: అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదని బెంగళూరు ఓపెనర్‌ దేవ్‌దత్ పడిక్కల్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ టోర్నీలో పడిక్కల్‌ సత్తాచాటిన సంగతి తెలిసిందే. తన తొలి సీజన్‌లోనే 473 పరుగులు సాధించి బెంగళూరు జట్టులో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అంతేగాక ‘ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు’ను సాధించాడు. అయితే భీకర పేసర్ల బౌలింగ్‌లో ఆడటం కంటే రషీద్‌ బంతుల్ని ఎదుర్కోవడం సవాలుగా ఉంటుందని తెలిపాడు.

‘‘పేసర్లను ఎదుర్కోవడం కష్టతరంగా అనిపించలేదు. ఎందుకంటే దేశవాళీ క్రికెట్‌లో వేగవంతమైన కొంత మంది ఫాస్ట్‌ బౌలర్ల బౌలింగ్‌లో ఆడాను. కానీ, రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ సవాలుగా అనిపించింది. అతడు ఒకే సమయంలో మంచి పేస్‌తో పాటు వైవిధ్యభరితమైన బంతుల్ని సంధిస్తాడు. అతడిని ఎదుర్కొన్నప్పుడు.. ఇప్పటి వరకు అలాంటి బంతుల్ని ఆడలేదన్న అనుభూతి కలిగింది. అతడి బౌలింగ్‌లో భారీషాట్లు ఆడటం అంత సులువుకాదు’’ అని పడిక్కల్ అన్నాడు. తన ఆటపై మరింత దృష్టిపెట్టి భారత జట్టుకు ఎంపిక కావడానికి తీవ్రంగా కృషి చేస్తానని పేర్కొన్నాడు.

‘‘దేశం తరఫున ఆడటమే నా ముందున్న లక్ష్యం. క్రికెటర్‌గా ప్రతి ఒక్కరి కల ఇది. దాని కోసం తీవ్రంగా శ్రమిస్తాను. నా ఆటను మరింత మెరుగుపర్చుకుంటాను. అవకాశం వస్తే సత్తాచాటుతాను’’ అని పడిక్కల్‌ వెల్లడించాడు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని