బాలు.. నువ్వు నా మాట వినలేదు: ఇళయరాజా - I told you to come back soon and that I am waiting says Ilayarajaa
close
Published : 26/09/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలు.. నువ్వు నా మాట వినలేదు: ఇళయరాజా

భావోద్వేగంతో సంగీత దర్శకుడు

చెన్నై: తన ప్రాణ మిత్రుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా భావోద్వేగానికి గురయ్యారు. నోట మాటలు రావడం లేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచంలోని దేన్నీ చూడలేకపోతున్నానని కంటతడి పెట్టుకున్నారు. ‘బాలు.. నీ కోసం నేను ఎదురు చూస్తుంటానని, త్వరగా తిరిగి రమ్మని నీకు చెప్పా. కానీ నువ్వు నా మాటలు వినలేదు, వెళ్లిపోయావు. నువ్వు ఎక్కడికి వెళ్లావు?, ఎందుకు వెళ్లావు? గంధర్వుల కోసం పాడేందుకు వెళ్లావా? ఇప్పుడు ప్రపంచంలోని దేన్నీ నేను చూడలేను. నాకు మాటలు రావడం లేదు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఏ దుఖాఃనికైనా ఓ పరిమితి ఉంటుంది, కానీ నీ విషయంలో దానికి పరిమితి లేదు..’ అని ఆయన భావాల్ని వ్యక్తం చేశారు.

బాలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తర్వాత ఇళయరాజా వీడియో విడుదల చేశారు. త్వరగా కోలుకుని రమ్మని అడిగారు. ‘మన స్నేహం కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాదు. అది ఇక్కడితో ముగిసిపోదు. సంగీతం మన జీవితం.. జీవితమే సంగీతం.. మన స్నేహాన్ని, ప్రేమను ఎవరూ వేరు చేయలేరు. నువ్వు కోలుకుంటావని నా మనసు చెబుతోంది. నీ కోసం దేవుడ్ని ప్రార్థిస్తాను. త్వరగా వచ్చేయ్‌ బాలూ..’ అని అప్పట్లో ఇళయరాజా పేర్కొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని