టీమిండియాను చూసి నేర్చుకోండి.. - I want Pakistan to learn that from India the ICC Hall of Fame Zaheer Abbas
close
Updated : 10/09/2020 02:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీమిండియాను చూసి నేర్చుకోండి..

పాక్‌ జట్టుకు లెజెండరీ జహీర్‌ అబ్బాస్‌ సూచన

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ క్రికెట్‌ లెజెండరీ, తాజాగా ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న జహీర్‌ అబ్బాస్‌ ప్రస్తుత పాక్‌ జట్టు లోపాలను ఎత్తిచూపాడు. టీమిండియా నుంచి పలు విషయాలు నేర్చుకోవాలంటూ సూచించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు భారత బ్యాట్స్‌మెన్‌ చూపే తెగువను అలవర్చుకోవాలంటూ సూచించాడు. ‘భారత జట్టు బ్యాట్స్‌మెన్‌ ఆటతీరును పరిశీలించండి. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఆదుకుంటారు. ప్రస్తుత పాకిస్థాన్‌ జట్టు నేర్చుకోవాల్సింది అదే’ అని ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘మా వద్ద నుంచే టీమిండియా ఈ లక్షణాన్ని అలవర్చుకుంది. మేము ఏదైతే చేశామో అది అందరూ నేర్చుకున్నారు. కానీ ఇప్పడు మేం వారి నుంచి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది’ అని అన్నాడు. భారత డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ ఆట తీరును చూసి నేర్చుకోవాలని సూచించాడు. ‘రోహిత్ బాగా ఆడుతుంటే అతడిని చూసి నేర్చుకోండి. అతడి ఆటను, టెక్నిన్‌ను పరిశీలించడండి. నేను హానిఫ్‌ మహమ్మద్‌, రోహన్‌ కన్హాయ్‌ ఆటను చూసి నేర్చుకునేవాడిని’ అని వెల్లడించాడు. బోర్డుతో ఆటగాళ్లు సక్రమంగా మెలగాలని, బోర్డు సభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని పేర్కొన్నాడు.

ఆసియా బ్రాడ్‌మన్‌గా పిలుచుకునే పిలుచుకునే జహీర్‌ అబ్బాస్‌ తన కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 108 సెంచరీలు చేశాడు. 78 టెస్టుల్లో 44.79 సగటుతో 5062 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కల్లిస్‌, ఆస్ట్రేలియా మజీ మహిళా క్రికెటర్‌ లీసా స్టాన్‌లేకర్‌తో పాటు జహీర్‌ అబ్బాస్‌ 2020కి గాను ఐసీసీ హాల్‌ ఆఫ్ ఫేమ్‌లో చోటుదక్కించుకున్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని