ప్రభాస్‌ చిత్రంపై కామెంట్‌.. చిక్కుల్లో నటుడు - I would like to sincerely apologise to everybody and withdraw my statement says Saif Ali Khan
close
Updated : 06/12/2020 17:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ చిత్రంపై కామెంట్‌.. చిక్కుల్లో నటుడు

క్షమాపణలు చెప్పిన సైఫ్‌ అలీ ఖాన్‌

ముంబయి: కథానాయకుడు ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్‌ దర్శకుడు. ఇందులో ప్రభాస్‌ రాముడిగా, సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా కనిపించబోతున్నారు. ఇంకా కథానాయిక ఖరారు కాలేదు. రెండు రోజుల క్రితం సైఫ్‌ ఈ సినిమాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయన్ను వివాదాల్లోకి నెట్టాయి. రాక్షసరాజు రావణుడిలోని మానవత్వం కోణాన్ని ‘ఆదిపురుష్‌’లో చూపించబోతున్నామని, రాముడితో యుద్ధం ఒప్పేనన్న కోణంలో చిత్రం ఉంటుందన్నారు.

సైఫ్‌ మాటలపై భాజపా నాయకుడు రామ్‌ కదంతోపాటు మరికొందరు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయన మాటలు షాక్‌కు గురి చేశాయని రామ్‌ కదం ట్వీట్‌ చేశారు.  రావణుడ్ని మంచివాడిగా తెరపై చూపిస్తే ఊరుకోమని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో సైఫ్‌ తాజాగా స్పందించారు. ఇతరుల మనోభావాల్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. వాస్తవ కథను వక్రీకరించకుండా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని స్పష్టం చేశారు. ‘నేను ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కొందరి మనోభావాల్ని దెబ్బతీశాయని, వివాదానికి తెరతీశాయని తెలిసింది. ఇది నా ఉద్దేశం ఏ మాత్రం కాదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నా, నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా. రాముడు ధర్మానికి, వీరత్వానికి చిహ్నంగా నేను భావిస్తాను. చెడుపై మంచి సాధించిన విజయం చుట్టూ ‘ఆదిపురుష్‌’ చిత్రం ఉంటుంది. కథను వక్రీకరించకుండా ప్రతిష్ఠాత్మకంగా చిత్రాన్ని తీసే దిశగా మొత్తం చిత్ర బృందం శ్రమిస్తోంది’ అని సైఫ్‌ వివరించారు. ‘తానాజీ’తో ఇటీవల హిట్‌ అందుకున్న ఓం రౌత్‌ తీయబోతున్న ‘ఆదిపురుష్‌’ 2022 ఆగస్టు 11న విడుదల కాబోతోంది.

ఇవీ చదవండి..

జేమ్స్‌ బాండ్‌ను బీట్‌ చేసిన అల్లు అర్జున్‌

వాళ్లిద్దరూ పదేళ్లు సహజీవనం చేశారు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని