కామన్వెల్త్‌లోకి మళ్లీ.. క్రికెట్‌! - ICC CGF unveil qualifying process for womens cricket event in 2022 CWG
close
Published : 19/11/2020 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కామన్వెల్త్‌లోకి మళ్లీ.. క్రికెట్‌!

అర్హత ప్రక్రియ ఆరంభించిన ఐసీసీ, సీజీఎఫ్‌

దుబాయ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌కు పునః ప్రవేశం లభించింది. 2022లో నిర్వహించే కామన్వెల్త్‌ మహిళల టీ20 క్రికెట్‌ పోటీలకు అర్హత ప్రక్రియ మొదలైంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి ఆతిథ్య ఇంగ్లాండ్‌ సహా వరుసగా అత్యధిక ర్యాంకుల్లో కొనసాగుతున్న ఆరు జట్లకు నేరుగా అర్హత లభిస్తుంది. నాలుగేళ్లకు ఒకసారి జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో 1998లో పురుషుల క్రికెట్‌ భాగమైంది. కౌలాలంపూర్‌లో జరిగిన క్రీడల్లో క్రికెట్‌ పోటీలు పెట్టారు. ఆ తర్వాత నిలిపేశారు. మళ్లీ ఇన్నేళ్లకు మహిళల క్రికెట్ రూపంలో భాగస్వామ్యం లభించింది.

కామన్వెల్త్‌ క్రికెట్‌ పోటీల్లో మొత్తం ఎనిమిది జట్లు పోటీపడతాయి. ఆతిథ్య ఇంగ్లాండ్‌కు ఎలాగూ చోటుఉంటుంది. ఆ తర్వాత ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లోని జట్లకు నేరుగా అర్హత లభిస్తుంది. మిగిలిన ఆ ఒక్క జట్టునూ తర్వాత ప్రకటిస్తారు. 2022, జనవరి 31లోపు జరిగే అర్హత పోటీల్లో విజేతకు చోటు లభిస్తుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా‌ క్రికెట్‌ మ్యాచులు జరుగుతాయి. ఇప్పటివరకు కరీబియన్‌ దీవులు ఏ దేశానికి ఆ దేశం ప్రత్యేకంగా ప్రాతినిధ్యం వహించాయి. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌ తొలి ఆరు స్థానాల్లో గనక నిలిస్తే మరో జట్టుకు అవకాశం దొరకనుందని సమాచారం.

కామన్వెల్త్‌ క్రీడలు బర్మింగ్‌ హామ్‌ వేదికగా 2022లో జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి. ప్రస్తుతం భారత మహిళల టీ20 జట్టు నాలుగో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్‌ మూడో ర్యాంకులో కొనసాగుతోంది.

‘మహిళల క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగేందుకు కామన్వెల్త్‌ క్రీడలు ఓ అద్భుతమైన అవకాశం’ అని ఐసీసీ సీఈవో మను సాహ్నీ అన్నారు. ‘కామన్వెల్త్‌లో క్రికెట్‌ను చేర్చడం క్రీడాకారులకు గొప్ప అవకాశం. ఆ క్రీడల్లో టీమ్‌ఇండియా కచ్చితంగా పాల్గొంటుంది. నాణ్యమైన క్రికెట్‌ ఆడుతూ విజయవంతం అవుతుందని నా విశ్వాసం’ అని టీమ్‌ఇండియా టీ20 సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ధీమా వ్యక్తం చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని