భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వాయిదా - IFFI postponed to January says Javadekar
close
Published : 24/09/2020 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వాయిదా

దిల్లీ: భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) వాయిదా పడింది. నవంబర్‌ 20 నుంచి 28 మధ్య గోవాలో జరగాల్సిన 51వ చిత్రోత్సవాలను వచ్చే ఏడాది జనవరి 16 నుంచి 24 తేదీల మధ్య నిర్వహించాలని నిర్ణయించినట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్‌ వెల్లడించారు. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌తో చర్చించిన అనంతరం ఈ ప్రకటన జారీ చేసినట్టు పేర్కొన్నారు. కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సమాచార, ప్రసారాల శాఖ అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021 జనవరి 16 నుంచి 24 తేదీల్లో గోవాలో అన్ని మార్గదర్శకాలను అనుసరించి నిర్వహించాలని సంయుక్తంగా నిర్ణయించినట్టు జావడేకర్‌ తెలిపారు. ఈసారి హైబ్రిడ్‌ పద్ధతి (వర్చువల్‌, ఫిజికల్‌)లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని