సీఎస్‌కేలో కొవిడ్‌: ఆసీస్‌ పేసర్‌ ఆందోళన - IPL Hazlewood concerned with CSKs COVID outbreak
close
Published : 31/08/2020 23:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఎస్‌కేలో కొవిడ్‌: ఆసీస్‌ పేసర్‌ ఆందోళన

సౌతాంప్టన్‌: చెన్నై సూపర్‌కింగ్స్‌ బృందంలో కొవిడ్‌-19 కేసులు రావడం ఆందోళన కలిగిస్తోందని ఆస్ట్రేలియా పేసర్‌ జోస్‌ హేజిల్‌వుడ్‌ అన్నాడు. వైరస్‌ సోకినవారు ఏకాంతంలో ఉన్నారని చెప్పాడు. నిజానికి కేసులేమీ రాకుంటేనే మంచిదని పేర్కొన్నాడు. ఇప్పటికైతే ఇంగ్లాండ్‌ పర్యటనపై దృష్టి సారించానని వెల్లడించాడు. ఐపీఎల్‌లో అతడు సీఎస్‌కేకు ఆడాల్సి ఉంది.

సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు ఐపీఎల్‌-2020 జరుగుతుంది. జట్లన్నీ ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. అయితే చెన్నై సూపర్‌కింగ్స్‌ బృందంలో ఇద్దరు ఆటగాళ్లు సహా 13 మందికి కొవిడ్‌-19 సోకింది. పేసర్‌ దీపక్‌ చాహర్‌, బ్యాటర్‌ రుత్‌రాత్‌ గైక్వాడ్‌కు కరోనా రావడంతో మిగతావారికి దూరంగా ఏకాంతంలో ఉన్నారు.

సీజన్‌ ఆరంభం అయ్యేసరికి కేసులేమీ లేకుంటే మంచిదని హేజిల్‌వుడ్‌ అన్నాడు. ‘మాకో (సీఎస్‌కే) వాట్సప్‌ గ్రూప్‌ ఉంది. సమాచారం అంతా అందులో వస్తోంది. కేసుల గురించి తెలుసుకొంటే ఆందోళన కలుగుతోంది. అసలు కేసులే ఉండొద్దు. అయితే ఇప్పుడువారు క్వారంటైన్‌లో ఉన్నారు. త్వరలోనే ముగుస్తుంది. ఇప్పటికైతే నా దృష్టంతా ఇంగ్లాండ్‌ పర్యటనపై ఉంది. ఐపీఎల్‌ తేదీ సమీపించినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను. క్రికెట్‌ ఆస్ట్రేలియా దీని గురించి  మాట్లాడలేదు. ఇంకొన్ని రోజులు ఉంది కదా. కేసులు మరిన్ని పెరిగితే సీఏ మాతో మాట్లాడొచ్చు’ అని అతడు పేర్కొన్నాడు. డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌, ప్యాట్‌ కమిన్స్‌, ఆరోన్‌ ఫించ్‌ వంటి కీలక ఆటగాళ్లు ఇంగ్లాండ్‌ నుంచే యూఏఈకి రానున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని