
తాజా వార్తలు
సిల్క్ స్మిత బయోపిక్‌లో అనసూయ?
కోలీవుడ్లోకి రంగమ్మత్త ఎంట్రీ
హైదరాబాద్: వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను మెప్పించి.. రంగమ్మత్తగా సినీ ప్రేమికులకు చేరువైన నటి అనసూయ. ‘రంగస్థలం’ చిత్రంతో నటిగా విజయాన్ని అందుకున్న అనసూయ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా తెలుగువారిని అలరించిన ఆమె ఇప్పుడు తమిళ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలనాటి నటి సిల్క్ స్మిత బయోపిక్‌లో అను నటించనున్నారంటూ ప్రచారం సాగుతోంది. సదరు ప్రాజెక్ట్ పనుల్లో భాగంగానే ఆమె ఇటీవల చెన్నైకి వెళ్లారని వార్తలు వస్తున్నాయి. అయితే సదరు వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
కాగా, ఇటీవల చెన్నైకి వెళ్లిన అను కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతితో ఫొటోలు దిగి ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. ‘అద్భుతమైన నటుడు విజయ్‌సేతుపతిని కలవడం ఎంతో సంతోషంగా ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. అద్దంలో తన అందాన్ని చూసుకుంటున్న మరో ఫొటోని షేర్ చేస్తూ.. ‘మరో మంచి కథతో జీవితాన్ని కొనసాగించనున్నాను. సరికొత్త ఆరంభం, కోలీవుడ్, తమిళనాడు’ అని పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా అలనాటి నటి సిల్క్ స్మితను ఆధారంగా చేసుకుని తాను ఈ ఫొటో దిగినట్లు వెల్లడించారు. ఈ ఫొటోలు నెటిజన్లను ఎంతగానో ఆకర్షించాయి. సదరు ఫొటోలు చూసిన నెటిజన్లు నిజంగానే అనసూయ సిల్క్ స్మిత బయోపిక్‌లో నటించనున్నారంటూ మాట్లాడుకుంటున్నారు.
ఇవీ చదవండి
రాత్రికి రాత్రే స్టార్డమ్ వెనుక ఆరేళ్ల కష్టం..!
సామ్‌కి ప్రైవసీ లేదు.. రాధిక ఫ్యామిలీ వేడుక
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
