లొకేషన్స్‌ వేటలో రాజమౌళి..? - IS This Rajamouli Searching For RRR Locations
close
Published : 18/09/2020 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లొకేషన్స్‌ వేటలో రాజమౌళి..?

నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న ఫొటోలు

హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం). లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని టాలీవుడ్‌ టాక్‌. వైద్యుల సూచన మేరకు ‘ఆర్ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ ఉంటుందని ఇప్పటికే జక్కన్న చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజమౌళి తన సతీమణి రమాతో కలిసి కర్ణాటకలోని బందిపొరా టైగర్‌ రిజర్వ్‌లో పర్యటించారు. మూడురోజుల పర్యటనలో భాగంగా అటవీ ప్రాంతంలోని ఎన్నో ప్రదేశాలను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా, ఇది సాధారణ టూరా? లేక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లొకేషన్స్ వేటలో భాగంగానే రాజమౌళి అక్కడికి వెళ్లారా? అన్నది తెలియరాలేదు.

దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న రామ్‌చరణ్‌ సరసన బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ సందడి చేయనున్నారు. అలాగే కొమరం భీమ్‌గా మెప్పించనున్న ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ భామ ఓలీవియా మోరీస్‌ నటించనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌, నటి శ్రియ అతిథి పాత్రల్లో మెరవనున్నారు. 70 శాతం వరకూ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని