close

తాజా వార్తలు

రాజశేఖర్‌ కుమార్తెకు లక్కీ ఛాన్స్‌..?

హైదరాబాద్‌: ‘దొరసాని’ చిత్రంతో వెండితెరకు కథానాయికగా పరిచమయ్యారు నటుడు రాజశేఖర్‌ కుమార్తె శివాత్మిక. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో శివాత్మిక నటించనున్నట్లు తెలుస్తోంది. మరాఠీలో విజయవంతమైన ‘నటసామ్రాట్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో శివాత్మిక ప్రకాశ్‌ రాజ్‌ - రమ్యకృష్ణల కుమార్తెగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇప్పటికే ఈ సినిమాలో బ్రహ్మానందం ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అంతేకాకుండా బ్రహ్మానందం పాత్ర హృదయాలను హత్తుకునేలా ఉంటుందని దర్శకుడు కృష్ణవంశీ తెలిపారు. మరోవైపు ‘బిగ్‌బాస్‌’ విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ సైతం ఈ చిత్రంలో నటించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనిపై స్పందించిన రాహుల్‌.. కృష్ణవంశీ సినిమాతో వెండితెరకు నటుడిగా పరిచయమవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈసినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.