సిద్ధాంతాలను బట్టే రజనీతో పొత్తు: కమల్‌ - If our ideology is similarwe are ready to set aside our ego and co-operate with each other kamal hassan
close
Published : 16/12/2020 02:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సిద్ధాంతాలను బట్టే రజనీతో పొత్తు: కమల్‌

చెన్నై: తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్‌ నెలకొల్పనున్న పార్టీతో పొత్తుపై ఎంఎన్‌ఎం(మక్కల్‌ నీదు మయ్యం) అధినేత కమల్‌ హాసన్‌ స్పందించారు. సిద్ధాంతాలు ఒకే విధంగా ఉంటే కలిసి పనిచేస్తామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘సిద్ధాంతాలు ఒకే విధంగా ఉంటే కలిసి పనిచేయడానికి సిద్ధం. అదేవిధంగా ఆ సిద్ధాంతాలు ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి. అలా ఉంటే భేషజాలకు పోకుండా పరస్పరం సహకరించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని కమల్‌ స్పష్టం చేశారు.  

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ఆరంగేట్రంపై ఎదురుచూపులకు ఇటీవల తెరదించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో పార్టీ పెట్టబోతున్నానని, ఇందుకు సంబంధించిన వివరాలను డిసెంబర్‌ 31న వెల్లడిస్తానని ఇటీవల ఆయన అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ‘మక్కల్‌ సేవై కట్చి’గా రజనీ పార్టీ పేరు ఎన్నికల సంఘంలో నమోదు చేసినట్లు, ఆయనకు ఈసీ ఆటో గుర్తు కేటాయించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఆ వార్తల్ని రజనీ వర్గీయులు ధ్రువీకరించలేదు.

ఇదీ చదవండి

మక్కల్‌ సేవై కట్చి.. రజనీ పార్టీ ఇదేనా?


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని