
తాజా వార్తలు
అప్పట్లో భయపడ్డా: ఇలియానా
ముంబయి: ‘దేవదాసు’ చిత్రంతో కథానాయికగా పరిచయమై.. ‘పోకిరి’తో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుని అనంతరం బాలీవుడ్లో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారు నటి ఇలియానా. ‘పాగల్‌పంతీ’ చిత్రం తర్వాత ఆమె కథానాయికగా తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ’. బల్వీందర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‌దీప్ హుడా కీలకపాత్రలో కనిపించనున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్లో పాల్గొనడంపై నటి ఇలియానా తాజాగా స్పందించారు.
‘షూటింగ్ కారణంగా తిరిగి ముంబయి వచ్చేశాను. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్లో పాల్గొంటున్నాం. దాదాపు షూటింగ్ పూర్తికావొచ్చింది. కరోనా కారణంగా షూటింగ్లో పాల్గొన్న మొదటిరోజు కొంచెం భయపడ్డాను. చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు అందరం కొవిడ్-19 పరీక్ష చేయించుకున్నాం. సెట్లో సరైన జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఇప్పుడు అలవాటు అయ్యింది’
‘చాలాకాలం గ్యాప్ తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభించిన సమయంలో నా పాత్ర మర్చిపోయానేమోననే అనుమానం వచ్చింది. చిత్రీకరణకు వెళ్లే ముందు కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని నేనూ, దర్శకుడు అనుకున్నాం. కానీ, కెమెరా ముందుకు వెళ్లగానే.. సహజంగానే పాత్రలోకి లీనమైపోయాను. నిజం చెప్పాలంటే బ్రేక్ వల్లే ఇంకా బాగా నటించగలుగుతున్నాను’ అని ఇలియానా వివరించారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇక చాలు
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- అందరివాడిని
- సాహో భారత్!
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- కొవిడ్ టీకా అలజడి
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
