నిజమే.. అప్పుడు డేటింగ్‌లో ఉన్నా! - Im ready to find someone who can bear with me Says Sandeep
close
Published : 23/09/2020 13:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిజమే.. అప్పుడు డేటింగ్‌లో ఉన్నా!

పెళ్లి గురించి స్పందించిన హీరో

హైదరాబాద్‌: మూడేళ్ల క్రితం తాను ఓ అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నానని.. ఓ కారణం వల్ల ఆ విషయాన్ని బయటకు చెప్పలేదని నటుడు సందీప్‌ కిషన్‌ అన్నారు. లాక్‌డౌన్‌లో పూర్తి వర్కౌట్లు చేసి ఇటీవల సిక్స్‌ప్యాక్‌తో సందీప్‌ అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా ఆయన సోషల్‌మీడియాలో షర్ట్‌లెస్‌ ఫొటో షేర్‌ చేశారు. ఈ నేపథ్యంలో సందీప్‌ తన పెళ్లి గురించి ముచ్చటించారు

‘‘ప్రస్తుతం నేను ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నాను. పాత్ర డిమాండ్‌ చేయడంతో బరువు తగ్గి, ఫిట్‌గా మారాను. ఇప్పుడు నా లుక్‌ పట్ల నేనేంతో సంతోషంగా ఉన్నా. ఈ లాక్‌డౌన్‌లోనే నా స్నేహితులు కొంతమంది వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దీంతో నేను కూడా త్వరలోనే శుభవార్త చెబుతానని చాలామంది భావించారు. నిజం చెప్పాలంటే పెళ్లి విషయంలో నా కుటుంబం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. ‘ఇంకెంత కాలం సింగిల్‌గా ఉంటావ్‌. త్వరగా పెళ్లి చేసుకో’ అని నా స్నేహితులు మాత్రం తరచూ అంటుంటారు’’

‘‘మూడేళ్ల క్రితం నేను ఒక అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నాను. కాకపోతే ఆ విషయాన్ని రహస్యంగానే ఉంచాను. ఎందుకంటే నా వల్ల ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనుకున్నాను. ఇప్పుడు నేను సింగిల్‌. ఫన్నీ, సపోర్టివ్‌, నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కోసం వెతకడానికి సిద్ధంగా ఉన్నా. అన్నింటికంటే ముఖ్యంగా నన్ను భరించగలిగే అమ్మాయి దొరికితే నేను ఎంతో సంతోషిస్తా. అలాంటి అమ్మాయి దొరికితే ఈ భూమ్మీద నాకంటే అదృష్టవంతుడు ఉండడని భావిస్తా’’ అని సందీప్‌ వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని