అలా చేస్తే జట్టుకు సమతూకం: రైనా - Important for batsmen to be able to bowl Raina
close
Published : 09/12/2020 00:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలా చేస్తే జట్టుకు సమతూకం: రైనా

ముంబయి: టీమ్‌ఇండియాకు ఆడుతున్నప్పుడు పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా భాగస్వామ్యాలు విడదీసినందుకు సంతోషంగా ఉందని మాజీ క్రికెటర్‌ సురేశ్‌రైనా అన్నాడు. బ్యాట్స్‌మెన్‌ అప్పుడప్పుడు బౌలింగ్‌ చేసి వికెట్లు తీస్తే జట్టు సమతూకం వైవిధ్యంగా మారుతుందని పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత్‌కు అలాంటి సేవలు లభించడం లేదని వెల్లడించాడు. వెన్నుముక శస్త్రచికిత్స తర్వాత హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ చేయని సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీసేనకు ఆరో బౌలింగ్‌ వనరు అందుబాటులో ఉండటం లేదు.

‘బ్యాట్స్‌మెన్‌ బౌలింగ్‌ చేయడం బౌలర్లు బ్యాటింగ్‌ చేయడం అత్యంత కీలకం. అది జట్టుకెప్పటికీ లాభమే. బ్యాట్స్‌మన్‌ కనీసం 4-5 ఓవర్లు వేయడం కెప్టెన్‌కు అవసరం. అప్పుడే జట్టులోని అత్యుత్తమ బౌలర్‌కు వికెట్లు తీసే వెసులుబాటు కలుగుతుంది’ అని రైనా అన్నాడు. ఒకప్పుడు సచిన్‌, వీరూ, యువీ, తాను పార్ట్‌టైమ్‌ బౌలింగ్‌ చేసేవాళ్లమని అతడు గుర్తు చేసుకున్నాడు.

‘సచిన్‌ బౌలింగ్‌ చేశారు. వీరూ భాయ్‌ వికెట్లు తీశారు. ప్రపంచకప్‌ గెలిచేందుకు, జోరు కొనసాగించేందుకు యువీ సాయపడ్డాడు. ఒకప్పుడు గ్రామాల్లో టోర్నీలు జరుగుతుంటే బ్యాటింగ్‌తో పాటు మేం బౌలింగ్‌ చేసేవాళ్లం. లేదంటే జట్టులోకి తీసుకొనేవాళ్లు కాదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ అవకాశం వస్తుందో రాదో తెలియదు కాబట్టి ఫీల్డింగ్‌ కూడా బాగా చేయాల్సి వచ్చేది. ఇక దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించనందుకు, కలలను సాకారం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. కాలం గడిచే కొద్దీ ఎంతో అనుభవం సంపాదించాను’ అని రైనా పేర్కొన్నాడు.

ఇవీ చదవండి
ధోనీని నేనూ మిస్‌ అవుతున్నా: కోహ్లీ
కోహ్లీ పోరాడినా భారత్‌కు తప్పని ఓటమి

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని