భెల్‌కు పెరిగిన నష్టం - Increased damage to the bhel
close
Published : 12/09/2020 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భెల్‌కు పెరిగిన నష్టం

ఏప్రిల్‌- జూన్‌లో రూ.893 కోట్లు

దిల్లీ: ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి భెల్‌ ఏకీకృత ప్రాతపదికన రూ.893.14 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.218.93 కోట్లతో పోలిస్తే నష్టం భారీగా పెరగడం గమనార్హం. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలతో సంస్థ కార్యకలాపాలపై తీవ్రంగా ప్రభావం పడటం ఇందుకు కారణమైంది. మొత్తం ఆదాయం రూ.4,673.38 కోట్ల నుంచి తగ్గి రూ.2,086.43 కోట్లకు పరిమితమైంది. కరోనా వైరస్‌ పరిణామాలు, లాక్‌డౌన్‌ ఆంక్షలు ఆర్థిక ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపినందున ఏడాదిక్రితం ఫలితాలతో ఈ ఫలితాలను పోల్చి చూడకూడదని భెల్‌ తెలిపింది. లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం తగు జాగ్రత్తలు తీసుకుంటూ, తక్కువ మంది సిబ్బందితో కార్యకలాపాలను క్రమక్రమంగా పునరుద్ధరించామని పేర్కొంది.

* జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బీజీఆర్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.74.42 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో రూ.12.49 కోట్ల నష్టాన్ని చవిచూసింది. మొత్తం ఆదాయం కూడా రూ.632.52 కోట్ల నుంచి తగ్గి రూ.127.76 కోట్లకు పరిమితమైంది.

* అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఏప్రిల్‌- జూన్‌లో ఏకీకృత పద్ధతిలో రూ.21.75 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే సమయంలో ఈ కంపెనీ రూ.97.44 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. మొత్తం ఆదాయం రూ.675.23 కోట్ల నుంచి పెరిగి రూ.878.14 కోట్లకు చేరింది.

* ఏప్రిల్‌- జూన్‌లో ఫ్యూచర్‌ సప్లయ్‌ సొల్యూషన్స్‌ నికర నష్టం ఏకీకృత ప్రాతిపదికన రూ.55.40 కోట్లకు పెరిగింది. ఏడాదిక్రితం ఇదే సమయంలో నష్టం రూ.7.67 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.300.57 కోట్ల నుంచి తగ్గి రూ.105.37 కోట్లకు పరిమితమైంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని