చైనా.. ఆ ప్రయత్నాలు మానుకో: కేంద్రం - India Rejects Chinas Attempt
close
Published : 06/08/2020 15:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనా.. ఆ ప్రయత్నాలు మానుకో: కేంద్రం

దిల్లీ: ఐరాస భద్రతామండలిలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తాలన్న చైనా కుయుక్తులను భారత్‌ ఎండగట్టింది. అలాంటి వృథా ప్రయత్నాలను మానుకోవాలని సూచించింది. భారత్ అంతర్గత వ్యవహారాల్లోకి తలదూర్చే యత్నాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి  కల్పించే రాజ్యాంగంలోని అధికరణ 370ను రద్దు చేసి సంవత్సరం పూర్తైన తరుణంలో.. బుధవారం ఐరాస భద్రతామండలిలో కశ్మీర్ అంశాన్ని చర్చించడం కోసం పాకిస్థాన్‌ చేసిన ప్రయత్నానికి చైనా మద్దతు పలికింది. అయితే ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు.

దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ‘భారత్‌లోని కేంద్ర ప్రాంతపాలితమైన జమ్మూకశ్మీర్‌కు చెందిన వివిధ అంశాలపై భద్రతామండలిలో చైనా చర్చను ప్రారంభించినట్లు మేం గుర్తించాం. భారత అంతర్గత అంశాన్ని చైనా లేవనెత్తడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మాదిరిగానే ఈసారి అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభించలేదు. భారత అంతర్గత వ్యవహారాల్లో కలగజేసుకోవడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే అలాంటి వృథా ప్రయత్నాలను మానుకోవాలని కోరుతున్నాం’ అని విదేశాంగ శాఖ సూచించింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని