కోలుకున్న వాళ్లు ఎక్కువగా మనోళ్లే! - India Has Highest Number corona Recoveries
close
Published : 15/09/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోలుకున్న వాళ్లు ఎక్కువగా మనోళ్లే!

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రరూపం దాల్చిన కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారిలో భారతీయులే అత్యధికమని జాన్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఇప్పటివరకు 37,80,107 మంది కొవిడ్‌ నుంచి బయటపడ్డారని, ఆ విషయంలో భారత్‌ సోమవారం నాటికి బ్రెజిల్‌ను దాటేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2.9 కోట్ల మందికి కరోనా సోకగా, వారిలో సుమారు 1.96 కోట్ల మంది కోలుకున్నారని విశ్వవిద్యాలయం అందించిన డేటా వెల్లడించింది. కాగా, వైరస్ కారణంగా 9లక్షలకు పైచిలుకు మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. 

విశ్వవిద్యాలయం ప్రపంచ వ్యాప్తంగా సేకరించి వివరాల ప్రకారం.. భారత్‌లో వైరస్‌ బారిన పడిన వారిలో 37,80,107 మంది కోలుకున్నారు. ఈ విషయంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. రికవరీ రేటు 78 శాతంగా ఉందని విశ్వవిద్యాలయం తెలిపింది. 37,23,206 మంది కోలుకున్న వారితో బ్రెజిల్ రెండో స్థానాన్ని ఆక్రమించిందని, తర్వాతి స్థానంలో యూఎస్‌ ఉందని పేర్కొంది. 

‘గడిచిన 24 గంటల్లో  భారత్‌లో 77,512 మంది ఆసుపత్రి నుంచి ఇళ్లకు చేరుకున్నారు. క్రియాశీల కేసులు, కోలుకున్న కేసుల మధ్య తేడా రోజురోజుకూ పెరుగుతోంది’ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా 48,46,427 కరోనా కేసులు నమోదు కాగా..వాటిలో 9,86,598 క్రియాశీల కేసులున్నాయి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని