జైషే ఉగ్ర‌ కుట్రను ప్రపంచం ముందుంచిన భారత్‌ - India briefs select group of envoys on attempted attack in Nagrota by JeM
close
Updated : 23/11/2020 22:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జైషే ఉగ్ర‌ కుట్రను ప్రపంచం ముందుంచిన భారత్‌

దిల్లీ: పాకిస్థాన్‌  కేంద్రంగా దేశంలో అలజడులు సృష్టించేందుకు జరుగుతున్న కుట్రలను భారత్‌ ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లింది. ఉగ్రవాదులకు పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ అందిస్తున్న సహకారం గురించి యూఎస్‌ సహా పలు ఐరాస శాశ్వత సభ్య దేశాల రాయబారులకు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్లా వివరించారు. ఇటీవల కశ్మీర్‌లో చోటుచేసుకున్న నగ్రోటా ఘటనను ఉద్దేశిస్తూ.. ఎన్‌కౌంటర్‌కు కారణమైన వారికి పాక్‌తో గల సంబంధాలను రాయబారులకు తెలియజేశారు. సొరంగ మార్గాల ద్వారా వారెలా భారత్‌లోకి చొరబడుతున్నారో స్పష్టంగా వివరించారు. జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులకు పాక్‌ ఇంటెలిజెన్స్‌కు ఉన్న సంబంధాల గురించి ఆయన రాయబారులకు తెలియపరిచారు. కాగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పాక్‌ కేంద్రంగా.. సరిహద్దుల్లో 200 ఉగ్రవాద దాడులు జరగగా.. 199 మంది ఉగ్రవాదులు మరణించినట్లు శ్రింగ్లా వెల్లడించారు. 

పుల్వామా తరువాత, ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులకు పథకాలు రూపొందించినట్లు.. అందుకు సంబంధించిన ఆధారాలను సైతం శ్రింగ్లా రాయబారులకు అందించారు. జమ్మూకశ్మీర్లో ఉన్న శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీయడం.. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడమే లక్ష్యంగా వారు చేస్తున్న కుట్రలను ఆయన వివరించారు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటాలో నలుగురు జైషే ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. వారి నుంచి భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని