కొవిడ్‌ వ్యాక్సిన్‌ మనకు లభించేదప్పుడే.. - India can have approved vaccine by this date
close
Updated : 28/08/2020 17:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ వ్యాక్సిన్‌ మనకు లభించేదప్పుడే..

న్యూయార్క్‌: దేశంలో కరోనా వైరస్‌ కట్టడికి సురక్షితమైన, ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ త్వరలోనే లభించనుందని అంచనాలు వెలువడుతున్నాయి. కాగా, అన్ని అనుమతులు లభించిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌, భారత్‌కు 2021 తొలి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తుందని బెర్న్‌స్టీన్‌ రీసెర్చ్‌ అనే అమెరికన్‌ పరిశోధనా సంస్థ అంచనా వేసింది. అంతేకాకుండా దేశంలో వ్యాక్సిన్‌ను తొలుత పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) అందుబాటులోకి తేగలదని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన అనంతరం దేశంలో 2021 తొలినాళ్లలో టీకాల ఉత్పత్తి, పంపిణీ ప్రారంభం కాగలదని సంస్థ కథనం.
కాగా.. సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా 2021 నాటికి 600 మిలియన్‌ డోసులను.. 2022 కల్లా బిలియన్‌ డోసులను అందించగలదని బెర్న్‌స్టీన్‌కు చెందిన నిపుణులు అంటున్నారు. కాగా, 2021లో దేశంలో పంపిణీ చేసేందుకు 400 నుంచి 500 మిలియన్ల డోసులు అందుబాటులో ఉండగలవట. వీటిలో 55 శాతం ప్రభుత్వ రంగంలో, 45 శాతం ప్రైవేటు రంగంలో లభించగలవని బెర్న్‌స్టీన్‌ అంటోంది. సీఐఐ కాకుండా.. భారత్‌ బయోటెక్‌, జైడస్‌, బయోలాజికల్-ఈ కూడా కరోనా టీకాల తయారీలో ముందున్నాయని సంస్థ తెలిసింది. ఈ లెక్కన భారత్‌ ఏటా సుమారు 2.3 బిలియన్‌ డోసుల వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని సంతరించుకోగలదని అంచనా.  
కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలో వ్యాక్సిన్‌ మార్కెట్‌ విలువ సుమారు ఆరు బిలియన్‌ డాలర్లు ఉండొచ్చని బెర్న్‌స్టెయిన్‌ లెక్కగట్టింది. 2020 సంవత్సరాంతం లేదా 2021 ప్రారంభానికి అనుమతులు గల కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారు చేసే విషయంలో.. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు సంస్థలు ముందంజలో ఉన్నట్టు వెల్లడించింది. భాగస్వామ్య విధానంలో వ్యాక్సిన్‌ను పొందేందుకు ఆక్స్‌ఫర్డ్‌, నోవా వ్యాక్స్‌లతో భారత్‌ ఒప్పందాలు కుదుర్చుకుందని కూడా అంటోంది. మరోవైపు, భారత్ తదితర వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలకు 100 మిలియన్‌ డోసుల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను సరఫరా చేసేందుకు సీఐఐ- గావి, ద వ్యాక్సిన్‌ అలియన్స్‌, బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌లతో ఈ నెల మొదట్లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివరిలోగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ దేశంలో అందుబాటులోకి రాగలదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఇటీవల ప్రకటించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని