భారత్‌కు కావాల్సిన కరోనా వ్యాక్సిన్ ఎంతంటే.. - India needs these many Covid vaccine doses
close
Published : 12/11/2020 21:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌కు కావాల్సిన కరోనా వ్యాక్సిన్ ఎంతంటే..

దిల్లీ: భారత్‌లో కొవిడ్‌-19 కేసుల సంఖ్య 87 లక్షలకు చేరువ కానుంది. ఈ విధంగా ప్రబలుతున్న మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్‌ ఒక్కటే సమీప పరిష్కారమని పలువురు భావిస్తున్నారు. ఇందుకు గాను వ్యాక్సిన్‌ తయారీలో ముందంజలో ఉన్న వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్‌ భూషణ్‌ ప్రకటించారు.  అందరికీ కొవిడ్‌ టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రానికి స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండుకు చెందిన ‘క్రెడిడ్‌ సూస్సీ’ అనే ఆర్థిక సేవల సంస్థ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

మార్చి 21కల్లా నాలుగో వంతు ప్రజలకు..

చిన్నారుల సంగతి అలా ఉంచితే.. భారత్‌లో  కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించేందుకుకు సుమారు 1.7 బిలియన్ల (170 కోట్లు) వ్యాక్సిన్‌ డోసులు అవసరమౌతాయని క్రెడిడ్‌ సూస్సీ లెక్కకట్టింది. జనవరి 2021 కల్లా భారత్‌లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తోంది. మార్చి 21కి దేశంలో నాలుగో వంతు ప్రజలకు వ్యాక్సిన్‌ లభిస్తుందని సంస్థ తెలిపింది. ఇక జులై 2021 కల్లా 40 నుంచి 50 కోట్ల డోసుల పంపిణీ జరగవచ్చని సంస్థ భావిస్తోంది.

భారత్‌కు సామర్ధ్యముంది

భారత్‌కు 240 కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ మోతాదులను ఉత్పత్తి చేసే సామర్ధ్యముందని ఈ సంస్థ అంచనాల్లో వెల్లడైంది. అంతేకాకుండా టీకా పంపిణీకి అవసరమైన గాజు సీసాలు (వయల్స్‌), సిరెంజీలు, ఆల్కహాల్‌ స్వాబ్‌లు తదితర సామగ్రిని కూడా భారత్‌ ఏర్పాటుచేసుకోగలదని క్రెడిడ్‌ సూస్సీ అభిప్రాయపడింది. వ్యాక్సిన్‌ వేసేందుకు సుమారు లక్ష మంది వైద్యారోగ్య సిబ్బంది అవసరమౌతారని సంస్థ అంటోంది.

ఈ సంస్థల టీకాలు అనుకూలం

అయితే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే భారత్‌లో అతిశీతల నిల్వ విధానాల లభ్యతే కాస్త ఆటంకం కావచ్చని క్రెడిడ్‌ సూస్సీ అంటోంది. అంతేకాకుండా. -20 డిగ్రీ సెల్సియస్‌ వద్ద ఉంచాల్సిన మోడెర్నా, -70 వద్ద ఉంచాల్సిన ఫిజర్‌ టీకాలతో పోలిస్తే..  -2 నుంచి -8 డిగ్రీ సెల్సియస్‌ల వద్ద పనిచేసే ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా, నోవావాక్స్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థల టీకాలు భారత్‌కు అనుకూలమని క్రెడిడ్‌ సూస్సీ అంటోంది. భారత్‌కు ఇప్పటికే ఉన్న 600 మిలియన్ల డోసుల వ్యాక్సిన్‌ నిల్వ సామర్ధ్యంతో పాటు.. ప్రైవేటు రంగంలోని సుమారు 300 మిలియన్‌ డోసుల సామర్ధ్యంతో సంవత్సరానికి 600 మిలియన్‌ కొవిడ్‌ డోసులను  ప్రజలకు అందచేయవచ్చని సంస్థ లెక్కలు వేస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని