‘మోదీ వల్లభారత్‌ ఎదుర్కొంటున్న విపత్తులివే’ - India reeling under Modi-made disasters says Rahul Gandhi
close
Published : 02/09/2020 15:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మోదీ వల్లభారత్‌ ఎదుర్కొంటున్న విపత్తులివే’

భాజపా సర్కార్‌పై రాహుల్‌ గాంధీ విమర్శలు

దిల్లీ: మోదీ ప్రభుత్వ విధానాలను తరచూ విమర్శిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తాజాగా వాటిలో పదును పెంచారు. చైనాతో ఘర్షణలు, కుంగిన వృద్ధిరేటు, పెరిగిన నిరుద్యోగిత వంటి అంశాల్ని ప్రస్తావిస్తూ భాజపా ప్రభుత్వంపై విరచుకుపడ్డారు. ‘మోదీ వల్ల సంభవించిన ఈ విపత్తుల్లో భారత్‌ చిక్కుకుంది’ అంటూ ఐదు అంశాల్ని ప్రస్తావించారు. వృద్ధి రేటులో కుంగుబాటు, 45 ఏళ్ల గరిష్ఠానికి చేరిన నిరుద్యోగిత, 12 కోట్ల ఉద్యోగాల కోత, రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ ఆదాయాన్ని నిలిపివేయడం, కరోనాతో ప్రపంచంలోనే అత్యధిక మంది మరణించడం, సరిహద్దుల్లో పొరుగు దేశాల అతిక్రమణ వంటివి మోదీ వల్ల సంభవించిన విపత్తులంటూ రాహుల్‌ విమర్శించారు. 

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో భారత వృద్ధి రేటు ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 23.9 శాతం కుంగిన విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వ విధానాలపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న రాహుల్‌ దేశ ఆర్థిక పరిస్థితే లక్ష్యంగా చేసుకున్నారు. నోట్ల రద్దుతో ప్రారంభమైన ఆర్థిక వ్యవస్థ పతనం మోదీ తప్పుడు నిర్ణయాలతో మరింత తీవ్రమవుతోందని ఆరోపిస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని