వారంలో 5800 రోగుల మృతి - India reports over 5800 Covid 19 fatalities in a week
close
Published : 23/08/2020 20:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారంలో 5800 రోగుల మృతి

దేశంలో కొనసాగుతున్న మృత్యుఘోష

దిల్లీ: దేశంలో కట్టలు తెంచుకున్న కరోనా మృత్యు ఘోషని కొనసాగిస్తోంది. కొద్ది రోజులుగా రోజూ 900లకు పైగా రోగులు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటివరకు 55 వేలకు పైగా మరణించగా ఈ ఒక్క వారంలోనే 5800 మంది మరణించారు. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, దిల్లీ రాష్ట్రాల్లోనే అత్యధిక మంది మృతిచెందుతున్నారు. ఈ వారంలో అంటే ఆగస్టు 16 నుంచి 22 వరకు 5814 మంది వ్యాధి సోకి మరణించారు. ఆగస్టు 19న ఒక్కరోజే 1092 మంది మృతిచెందడం గమనార్హం.

కొవిడ్‌ మరణాల్లో భారత్‌ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. దేశంలో మరణాల రేటులో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 21,698 మంది మృతిచెందారు. 6,340 మరణాలతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. కర్ణాటకలో 4,522 మంది, దిల్లీలో 4,270 మంది రోగులు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా శనివారం నాటికి 8 లక్షలకు పైగానే రోగులు మృతిచెందినట్లు రూటర్స్‌ ట్యాలీ అనే అధ్యయన సంస్థ వెల్లడించింది. కేవలం ఒక్క అమెరికాలోనే 1.7 లక్షల మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులో సగటున 5900 మరణిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. గంటలో 246 మంది, ప్రతి 15 సెకన్లకు ఒకరు మృత్యువాత పడుతున్నట్లు వెల్లడించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని