భారత్‌లో కరోనా విజేతలు @ కొత్త రికార్డు - India scales another peak-Total recoveries cross 2 million
close
Published : 19/08/2020 17:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో కరోనా విజేతలు @ కొత్త రికార్డు

కోలుకుంటున్నవారి గ్రాఫ్‌ పెరుగుతోందిలా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి శరవేగంగా కొనసాగుతున్నప్పటికీ.. ఈ మహమ్మారి కొమ్ములు వంచి విజేతలుగా నిలుస్తున్న వారి సంఖ్య అదేస్థాయిలో పెరుగుతోంది. కొవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అవుతున్నవారి గణాంకాల్లో మంగళవారం సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 60,091 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్యపరంగా ఇదే అత్యధికం. మరోవైపు, దేశ వ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య రెండు మిలియన్ల మార్కు దాటడం విశేషం. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 73.64శాతంగా ఉండగా.. మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశంలో మరణాల రేటు 1.91%గా ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశంలో వైరస్‌ యాక్టివ్‌ కేసుల లోడ్‌ తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలోని మొత్తం పాజిటివ్‌ కేసుల్లో పావువంతు (24.45%) మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో ఆగస్టు 9 నాటికి పాజిటివిటీ రేటు 9.01%గా ఉండగా.. క్రమంగా తగ్గి ప్రస్తుతం 8.72%గా ఉంది. దూకుడుగా కొవిడ్‌ పరీక్షలు నిర్వహించడంతో పాటు ట్రాక్‌ చేయడం, చికిత్స అందించేలా కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శనం చేస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషివల్లే రికవరీ రేటును పెంచడం, మరణాల రేటు తగ్గడం సాధ్యమవుతోందని పేర్కొంది.  మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో అత్యధిక సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. 

దేశంలో ఇప్పటివరకు 3,17,42,782 శాంపిల్స్‌ పరీక్షించగా.. 27,67,273మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధాణ అయింది. వీరిలో కరోనాతో పోరాడి 20,37,870 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 52,889 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 6,76,514 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

దేశంలో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదైన రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలిపే ఇన్ఫోగ్రాఫ్‌..

దేశ వ్యాప్తంగా కొవిడ్‌ పరిస్థితి ఇలా..


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని