పాక్‌ తీరుపై భారత్‌ ఆగ్రహం  - India summons Pakistani diplomat over ceasefire violation
close
Published : 15/11/2020 03:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌ తీరుపై భారత్‌ ఆగ్రహం 

పాక్‌ హైకమిషనర్‌కు సమన్లు

దిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ బలగాల కాల్పులపై భారత్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. నిన్నటి కాల్పుల ఘటనపై పాకిస్థాన్‌ తీరు పట్ల తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ఈ మేరకు భారత్‌లోని పాకిస్థాన్‌ హైకమిషనర్‌కు సమన్లు జారీచేసిన విదేశాంగ మంత్రిత్వశాఖ నిరసన తెలిపింది. దీపావళి వేళ ఉద్దేశపూర్వకంగానే పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. పౌరులపై దాడులను ఖండించింది. ఎలాంటి కవ్వింపులు లేకుండానే పలు సెక్టార్లలో పాక్‌ జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు చనిపోయారని, మరో 19మంది గాయపడ్డారని మండిపడింది. హింసను పెంచేందుకు యత్నించడం.. ఉగ్రవాదుల చొరబాటుకు మద్దతిస్తున్న పాక్‌ వైఖరిపై నిరసన తెలిపింది.

ఇదీ చదవండి..

పాక్‌ స్థావరాలపై రాకెట్ల వర్షం

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని