దేశంలో యాక్టివ్‌ కేసుల గ్రాఫ్ తగ్గుతోందిలా..! - India sustains steady trend of dipping per cent Active Cases
close
Updated : 30/09/2020 19:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశంలో యాక్టివ్‌ కేసుల గ్రాఫ్ తగ్గుతోందిలా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ ఈ వైరస్‌ బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత కొంతకాలంగా 90 వేలు.. 80వేలకు పైగా నమోదైన రోజువారీ కేసులు.. సోమవారం 70 వేలకు (నెల రోజుల్లో తొలిసారి) పడిపోయినా.. మళ్లీ మంగళవారం 80వేలు దాటేశాయ్‌. ఈ పరిస్థితుల్లో భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్నా రికవరీ అవుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 62.25 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో 51.87లక్షల మందికి పైగా కోలుకొని డిశ్చార్జి కాగా.. 97,497 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 9.4లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి.

ఆగస్టు 1నాటికి దేశంలో 33.32శాతంగా ఉన్న యాక్టివ్‌ కేసులు బుధవారానికి (సెప్టెంబర్‌ 30కి) 15.11%కి తగ్గినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న క్రియాశీల కేసుల్లో 76శాతం కరోనా అధిక ప్రభావం చూపుతున్న పది రాష్ట్రాల్లోనే ఉన్నట్టు పేర్కొంటున్నాయి.


దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 51.87లక్షల మందికి పైగా కోలుకోగా వారిలో 78శాతం డిశ్చార్జిలు కేవలం పది రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోనే ఉన్నట్టు కేంద్రం తెలిపింది. అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదైన మహారాష్ట్ర, ఏపీల్లోనే రికవరీ రేటు కూడా అధికంగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 10.6లక్షల మందికి పైగా కోలుకోగా.. ఏపీలో ఇది 6.29లక్షల మందికి పైనే. 5.36లక్షల మంది రికవరీ కావడంతో మూడో స్థానంలో తమిళనాడు  కొనసాగుతోంది. తెలంగాణలో 1.6లక్షల మందికి పైగా రికవరీ కావడంతో తెలంగాణ పదో స్థానంలో ఉంది.


దేశంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించినప్పటి నుంచి జూన్‌ 3 వరకు లక్ష మంది మాత్రమే కోలుకున్నారు. అప్పటి నుంచి తొలి 10లక్షల మంది కోలుకొనేందుకు 57 రోజులు పట్టగా.. 10 - 20లక్షల మంది కోలుకోవడానికి 20 రోజులు; 20 - 30లక్షలకు చేరడానికి 16 రోజులు; 30 - 40లక్షల మంది కోలుకొనేందుకు 13 రోజుల సమయం పట్టింది. అలాగే, కేవలం 11 రోజుల వ్యవధిలోనే 40 లక్షల నుంచి 50లక్షల మందికి ఈ సంఖ్య చేరుకోవడం దేశంలో రికవరీ రేటు వృద్ధిని సూచిస్తోంది. 


భారత్‌లో కరోనా పరీక్షల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 7,41,96,729 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఏ నెలలో ఎన్ని ల్యాబ్‌ల్లో, ఎన్నెన్ని పరీక్షలు చేశారు? ప్రతి మిలియన్‌ జనాభాకు గాను ఎంతమందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారనే వివరాలను తెలిపే గ్రాఫ్‌లు..


 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని